బోల్డ్ వెబ్ సీరీస్ లో సీనియర్ హీరోయిన్!

0

సినిమా యాక్టర్లకు గతంలో అవకాశాలు తగ్గిన తర్వాత ఇక నటనపరంగా చేసేందుకు ఏమీ ఉండేది కాదు. అయితే గతకొన్నేళ్ళుగా ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. టీవీ ఛానల్స్ విస్తృతి.. వెబ్ సీరీస్ రంగంలో అవకాశాలు రావడంతో సీనియర్ నటీనటులు గతంలో లాగా ఖాళీగా ఉండడం లేదు. ఏదో ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. రీసెంట్ గా సీనియర్ హీరోయిన్ మీనా కూడా ఈ జాబితాలో చేరింది.

మీనా ఒక తమిళ కామెడీ థ్రిల్లర్ సీరీస్ లో నటిస్తోంది. ‘కారోలిన్ కామాక్షి’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈమధ్యే ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ విడుదలయింది. ఈ సినిమాలో మీనా ఒక తమిళ బ్రాహ్మణ స్త్రీ పాత్రలో నటిస్తుంది. చూసేందుకు యమా డీసెంట్ గా ఉంటుందట కానీ నోరు తెరిస్తే మాత్రం బూతులతో విరుచుకు పడుతుంది. మీనాకు మొదటి నుంచి డీసెంట్ ఇమేజ్ ఉంది. బోల్డ్ పాత్రలు నటించడం ఎప్పుడూ చేయలేదు. దీంతో మీనా అభిమానులకు ఈ పాత్ర షాక్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు.

ఈ వెబ్ సీరీస్ లో మీనాతో పాటుగా జార్జియా ఎంజెలీనా.. ఆంటో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ తమిళ నటుడు వివేక్ ఈ సీరీస్ కు దర్శకుడు. జీ5 లో ఈ వెబ్ సీరీస్ డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ చేస్తారని మేకర్స్ ప్రకటించారు. కారోలిన్ కామాక్షి తో మీనా మరోసారి నటిగా బిజీ అవుతారేమో వేచి చూడాలి.
Please Read Disclaimer