మహేష్ ఆ లక్కీ చార్మ్ కావాలంటాడా?

0

సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ చాలా సహజం. అందులోనూ బయటికి కనిపించేవి కొన్ని కనిపించనివి కొన్ని. ఇప్పుడు ఈ అప్ డేట్ అంత ఈజీగా తెలిసిపోయేది కాదు. విషయానికి వస్తే మహేష్ దూకుడులో మీనాక్షి దీక్షిత్ అనే ఆర్టిస్ట్ చేసింది. హాట్ బ్యూటీగా పేరున్న ఈ అమ్మాయి తర్వాత ఇతర హీరోల సినిమాల్లో కూడా నటించింది. శ్రీను వైట్ల ఇచ్చింది చిన్న రోల్ అయినప్పటికీ మహేష్ దృష్టిలో పడింది.

ఆ తర్వాత భరత్ అనే నేను – మహర్షిలలో సైతం కనిపించింది. ప్రాధాన్యం తక్కువగా ఉన్నా మహేష్ హిట్ మూవీస్ అన్నింటిలో తాను ఉండటం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అందుకే సెంటిమెంట్ ని మిస్ చేయడం ఎందుకని సరిలేరు నీకెవ్వరులో ఏదైనా రోల్ ఆఫర్ చేయమని మహేష్ స్వయంగా దర్శకుడు అనిల్ రావిపూడికి చెప్పినట్టు ఫిలిం నగర్ గాసిప్

ఇది నిజమో కాదో చెప్పలేం కాని ఇలాంటి సెంటిమెంట్ అందరు హీరోలకు దర్శక నిర్మాతలకు ఏదో ఒక రూపంలో ఉండేవే. ఒకవేళ నిజంగా మీనాక్షి దీక్షిత్ ఇందులో ఉంటె మాత్రం నమ్మకాన్ని ఫాలో అయినట్టే అని చెప్పొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటున్న సరిలేరు నీకెవ్వరు కోసం ప్రత్యేకంగా వేసిన కొండారెడ్డి బురుజు సెట్ వద్ద కీలకమైన సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.

ఒక్కడు టైంలో నిజంగా ఆ లొకేషన్ లో పాల్గొన్న మహేష్ ఇప్పుడు స్టొరీ డిమాండ్ మేరకు ఎక్కువ స్కోప్ ఉండటంతో సెట్ వేయక తప్పలేదట. అనిల్ సుంకర – దిల్ రాజు – మహేష్ బాబు నిర్మాతలుగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరుకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. వచ్చే సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేశారు
Please Read Disclaimer