మెగాస్టార్ హీరోయిన్ .. గుర్తు పట్టగలరా?

0

మెగాస్టార్ చిరంజీవి సరసన ఆడి పాడిన మేటి హీరోయిన్.. ఇప్పుడు గుర్తుపట్టడం ఆయనకు కూడా కష్టమేనేమో!! కనీసం మీరైనా ట్రై చేస్తారా.. గుర్తు పడతారా? ఇంతకీ ఎవరావిడ..?

ఊహించలేదు తను ఇలా కనిపిస్తుంది అని! `ఔరా అమ్మక చెల్లా.. ఆలకించి నమ్మడమెల్లా.. అంటూ తన్మయత్వంతో చిందులేసిన మీనాక్షీ శేషాద్రీ ఈవిడే. `ఆపద్భాంధవుడు` చిత్రంలో చిరుకు జోడీగా నటించి మెగా ఫ్యాన్స్ గుండెల్లో కొలువుదీరింది. `హీరో` అనే సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన మీనాక్షి శేషాద్రి ఆ తరువాత ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆమె నటించిన చివరి చివరి చిత్రం టి.సుబ్బిరామిరెడ్డి నిర్మించిన `స్వామి వివేకానంద` అప్పట్లో హాట్ టాపిక్.

బీహార్- సింద్రీలో పుట్టిన మీనాక్షీ 1996 తరువాత సినిమాలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టేసింది. బ్యాంకింగ్ రంగానికి చెందిన హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లాడి అటుపై విదేశాలకు వెళ్లిపోయింది. ప్రస్తుతం అమెరికాలో టెక్సాస్ నగరంలో తన కుటుంబంతో కలిసి ఇద్దరు పిల్లలతో హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తోంది. 2006లో తన వ్యక్తిగత జీవితం ఆధారంగా చేసిన ఓ డాక్యుమెంటరీలో నటించింది. ఆ తరువాత బాలీవుడ్ ముఖం కూడా చూడలేదు. తన వయసుకు తగ్గ పాత్రల్ని చాలా మంది ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించింది.

టెక్సాస్ లో మోడ్రన్ మదర్ గా జీవితాన్ని గడిపేస్తోంది. ఆమె గెటప్ పూర్తిగా మారిపోయింది. ఓల్డ్ ఏజ్ కనిపించేస్తోంది. తనని ఇప్పడు గుర్తుపట్టడం కొంచెం కష్టమే. ఆంటీ పాత్రలు.. సహాయక పాత్రల్లో నటించే అవకాశం వున్నా మీనాక్షి ఆసక్తిని చూపించకపోవడం మాధురి దీక్షిత్.. కరీనా లాంటి సమకాలిక తారలకు ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. ఎందరో క్లాసిక్ తారలు ఇప్పుడు కంబ్యాక్ అవుతున్నారు. నచ్చిన పాత్రల్లో చేస్తున్నారు. ఇప్పటికీ పెళ్లయిన చాలా కాలం తర్వాతా మాధురి దీక్షిత్ సినిమాల్లో యాక్టీవ్ గా వుంటున్నా మీనాక్షి మాత్రం ఆసక్తిని చూపించకపోవడం వెనక కారణమేమిటో!
Please Read Disclaimer