‘మారో’ అనిపిస్తున్న మీరా

0

మీరా చోప్రా .. ఇటీవల సడెన్ స్టార్ గా పాపులరైన సంగతి తెలిసిందే. తనని ఆన్ లైన్ లో వేధింపులకు గురి చేస్తున్నారని ఇష్టానుసారం బూతు పదాలతో హింసించారని ఆరోపిస్తూ నేరుగా మంత్రి కేటీఆర్ కే నివేదించడంతో అది కాస్తా సంచలనమే అయ్యింది. అప్పటివరకూ అసలు ఈ భామ అసలు ఇండస్ట్రీలో ఉందా లేదా? అన్నది కూడా ఎవరూ పట్టించుకోలేదు.

ఇక మీడియా కథనాల్లోకి వచ్చాక మీరా తీరు తెన్నులు చూస్తే షాక్ తినాల్సిందే. అడ్డూ ఆపూ అన్నదే లేకుండా నిరంతరం సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో అగ్గి రాజేస్తోంది. రకరకాల భంగిమల్లో ఫోజులిస్తూ అంతకంతకు హీట్ పెంచేస్తోంది. మరోవైపు కమర్షియల్ ప్రకటనలకు ప్రచారం చేస్తోంది.

మీరా ఇంతకుముందు పవన్ సరసన `బంగారం` చిత్రంలో నటించింది. ఆ తర్వాత వినయ్ సరసన `వాన`.. నితిన్ తో `మారో` వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఆ సినిమాలతో గుర్తింపు దక్కినా ఆ తర్వాత అవకాశాలు అయితే రాలేదు. దీంతో టాలీవుడ్ పై అలిగి బాలీవుడ్ కి వెళ్లిపోయింది. ప్రస్తుతం హిందీ పరిశ్రమపైనే పూర్తిగా తన ఫోకస్. అయితే ఇటీవల వివాదాలతో వచ్చిన ప్రచారంతో మరోసారి టాలీవుడ్ పైనా మీరా గురి పెట్టిందట. కానీ ఇప్పటివరకూ ఆఫర్ అయితే ఇచ్చింది లేదు.