ఆ ప్రముఖ నటికి షాకిచ్చిన ఫైవ్ స్టార్ హోటల్

0

పేరు గొప్ప అన్న చందంగా ఉంటుంది చాలాసార్లు ఫైవ్ స్టార్ హోటళ్ల తీరు చూస్తే. ఇప్పటివకే నక్షత్రాల హోటళ్ల అసలు రంగు బయటకు వచ్చిన ప్రతిసారీ షాకులు తగులుతూనే ఉంటాయి. తాజాగా ఒక ప్రముఖ నటికి ఎదురైన చేదు అనుభవం తెలిస్తే షాక్ తినాల్సిందే.

అటు సౌత్ ఇటు నార్త్ లోనూ ఫేమస్ అయిన నటి మీరాచోప్రా. అమ్మడి ఖాతాలో సరైన హిట్లు పడలేదు కానీ.. చాలానే చిత్రాల్లో నటించింది. తాజాగా గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంది. దాదాపు వారం పాటు ఉన్న ఆమె.. హటాత్తుగా అనారోగ్యానికి గురైంది. అంతా బాగున్నప్పటికీ ఎందుకిలా అన్నది ఆమెకు అర్థం కాని పరిస్థితి.

అప్పటి నుంచి తనకు వడ్డించే ఆహారాన్ని చూసి మరీ తింటోంది. అలా తింటున్న ఆమెకు షాక్ తగిలినంత పనైంది. ఎందుకంటే.. ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్ ను అందమైన ప్లేట్ లో తీసుకొచ్చి సర్వ్ చేశారు. కానీ.. ఫుడ్ తినేందుకు సిద్ధమవుతున్న వేళ.. తినాల్సిన ఫుడ్ లోని నుంచి తెల్ల పురుగులు బయటకు రావటంతో ఆమె నోటి వెంట మాట రాని పరిస్థితి.

తనకు సర్వ్ చేసిన ఫుడ్ గురించి అర్థమైన ఆమె.. తన చేతిలోని ఫోన్ తో ఆ ఫుడ్ ను వీడియోగా తీసి.. తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. భారీగా ఛార్జ్ చేసే ఫైవ్ స్టార్ హోటళ్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయన్న దానికి తాజా ఉదంతం ఒక ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు. వారం రోజులుగా తానీ హోటల్లో ఉన్నానని.. హోటల్ కు వచ్చే ముందు తనకు బాగానే ఉన్నా.. తర్వాత తాను సిక్ అయ్యానని.. దానికి కారణం తాజాగా ఫుడ్ ను చూస్తే అర్థమైందన్నారు. బ్రేక్ పాస్ట్ కోసం తాను చేసి ఆర్డర్ పురుగులతో వచ్చినట్లు చెప్పారు. తనకీ చేదు అనుభవాన్ని మిగిల్చిన హోటల్ పేరును చెబుతూ.. తాను ఉన్నది డబుల్ ట్రీ హెల్టన్ హోటల్ అని చెప్పారు. ఇలాంటి హోటళ్లలో ఉండేందుకు చాలా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని.. అంత చెల్లించిన తర్వాత కూడా ఇలాంటి ఆహారం వడ్డించటం ఏమిటని ప్రశ్నించారు. ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారి.. సదరు హోటల్ ను తిట్టిపోస్తున్నారు నెటిజన్లు.
Please Read Disclaimer