కాపీ కొట్టకు అంటూ త్రిషకు సీరియస్ వార్నింగ్

0

“నన్ను కాపీ చేయవద్దు.. కావాలంటే ట్యాలెంట్ పెంచుకో“ అంటూ అందాల త్రిషకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది నటి కం మోడల్ మీరా మిథున్. ఇంతకీ ఎవరీమె? అంటే… తానా సెరుందా కూట్టం .. 8 తోట్టకల్ వంటి కొన్ని సినిమాల్లో నటించింది. కమల్ హాసన్ హోస్టింగ్ చేసిన పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ మూడవ సీజన్లోనూ ఈ నటి మెరిసారు.

ఇప్పుడిలా ట్యాలెంటెడ్ త్రిషకే వార్నింగ్ ఇచ్చిన మీరాకు వివాదాలు కొత్తేమీ కాదు. ఇంతకుముందు పలుమార్లు అందాల పోటీల్లో మోసపూరితంగా టైటిల్ నెగ్గేందుకు ప్రయత్నించిందని తనపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. అలాగే తమిళ బిగ్ బాస్ పోటీదారులతో గొడవలకు దిగి టీవీక్షకుల్లో బాగా పాపులరైంది. మోడీ.. పళనిసామి లాంటి నాయకులను ట్యాగ్ చేసి ట్వీట్టు చేయడం ద్వారానూ వివాదాలు చెలరేగాయి. అలాంటి నటి ఇప్పుడిలా త్రిషను ఎందుకు టార్గెట్ చేస్తోందో అర్థం కావడం లేదు.

త్రిష తనని ఇమ్మిటేట్ చేస్తోందంటూ ఓ ఫోటోని సోషల్ మీడియాల్లో షేర్ చేసిన మీరా ఇలా ఫైరైంది. “నన్ను కాపీ కొడుతూ కేశాలంకరణ సహా ఇతర విషయాల్లో అనుకరిస్తే అది తీవ్ర నేరం అవుతుంది. ఇకపై ఇలా జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను!“ అంటూ మీరా హెచ్చరించడం చూస్తుంటే ఇంతకుమించిన ప్రతిభావని లేదా అనుకరించడానికి?! అంటూ త్రిష ఫ్యాన్స్ చిన్నబుచ్చుకుంటున్నారు మరి. అసలు తారా తీరంలో గొప్ప తారకగా వెలిగిపోయిన త్రిషకు ఒక అనామక నటి వార్నింగ్ ఇవ్వడమా? అంటూ ఫైరయ్యేవాళ్లు ఉన్నారు.