ఇండస్ట్రీలో ఆత్మహత్యల పై మీరాచోప్రా సంచలన కామెంట్స్…!

0

టాలీవుడ్ లో కనుమరుగైన ‘బంగారం’ హీరోయిన్ మీరా చోప్రా అనూహ్యరీతిలో ఇటీవల తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని చెప్పి అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనపై అనుచితంగా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ మీరా చోప్రా పోలీసులకు మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా అందరూ మీరా చోప్రా గురించి మాట్లాడుకునేలా చేసింది. అంతేకాకుండా ఇటీవల మరణించిన బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎవరు అని ట్విట్టర్ లో ప్రశ్నించి నెటిజన్స్ కామెంట్స్ కి బలైంది. కొద్దిసేపటికే మళ్లీ ఆ ట్వీట్ ను డిలీట్ చేసి సుశాంత్ మృతిపై మరో ట్వీట్ చేసింది. ఇప్పుడు లేటెస్టుగా సుశాంత్ మరణం నేపథ్యంలో ఇండస్ట్రీలో ఆత్మహత్యలపై సంచలన కామెంట్స్ చేస్తూ మరో పోస్ట్ చేసింది.

కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చర్చలకు దారి తీస్తోంది. డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని మొదట అనుకోగా ఇప్పుడు రోజులు గడుస్తున్న కొద్దీ సుశాంత్ మరణంపై నెటిజన్లు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నారు. సుశాంత్ ది సూసైడ్ కాదని హత్య అని.. మరణం వెనుకున్న కోణాలను విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులపైన.. ఇండస్ట్రీ మాఫియాపైనా.. నెపోటిజం పైనా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ మహేష్ భట్ సూరజ్ పంచోలి లాంటి వారు సుశాంత్ మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మీరా చోప్రా ”ఈ ఇండస్రీలో నటీనటులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో చెప్పేందుకు.. నోరు విప్పేందుకు నాతో పాటు ఎంతోమంది రెడీగా ఉన్నారు” అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో స్టోరీలో పోస్ట్ చేసింది.

”ఇండస్ట్రీలో యాక్టర్స్ సూసైడ్స్ గురించి మాట్లాడటానికి నాతో పాటు చాలామంది రెడీగా ఉన్నారు. చావు అంచుల వరకు తీసుకొచ్చే వాటి గురించి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు. మనకు వ్యతిరేకంగా ఆ సిస్టమ్ ఎలా పని చేస్తుంది.. కొంతమంది డైరెక్టర్లు మానసికంగా ఎలా హింసిస్తారు.. తెలివైన వారు ఎవరూ అలా చేయరు.. ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. నేను ఎప్పటి నుంచో అక్కడ ఉన్నాను. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే.. మనం నోరు విప్పితే ఎంత మంది మనకు సపోర్ట్ గా నిలుస్తారు.. నా వెనుక ఎంత మంది నిలబడతారు. సుశాంత్ ఆత్మహత్య తరువాత ఇదంతా ఆగిందా? లేదు.. ఆ భయమే మనల్ని ఆ స్టెప్ తీసుకునేలా చేస్తుంది. అయితే అది కేవలం సినిమాలకు వర్క్ కి సంబంధించిందే కాదు. ఇండస్ట్రీలో చాలా విషయాల్లో ఉంది. అది మన ఆత్మ గౌరవం.. డిగ్నిటీ.. మన ప్రిన్సిపల్స్ మనశ్శాంతి ఇలా ఎన్నో విషయాలకు సంబంధించింది” అంటూ మీరాచోప్రా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.