పొగతాగని వాడు దున్నపోతు కాదా కిలాడీ!

0

కొన్ని ప్రకటనలు ఎంతో వినోదాత్మకంగానూ.. మరి కొన్ని ప్రకటనలు సందేశాత్మకంగానూ ఉంటాయి. వాటన్నింటిలో కొన్ని మాత్రమే ప్రజల్లోకి బలంగా దూసుకెళతాయి. ఇవి సమాజాన్ని కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. అలాంటి కోవలో చూస్తే.. బాలీవుడు కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన ధూమపానం- శానిటరీ ప్యాడ్స్ కు సంబంధించిన యాడ్. అయితే ఇందులో అక్షయ్కుమార్ ఒక వ్యక్తికి సూచనలిస్తారు. ధూమపానం మానేయడం ద్వారా ఆదా చేసిన డబ్బుతో తన భార్యకు శానిటరీ ప్యాడ్స్ కొనుగోలు చేయాలని చెబుతాడు. “దీన్ని ఇష్టపడండి లేదా ద్వేషించండి.. కానీ మీరు దీన్ని వదిలేయలేరు“ అంటూ ట్యాగ్ లైన్ జోడించారు.

ధూమపాన వ్యసనాన్ని తెరపై చూపించే అన్ని చిత్రాలకు 2018 ఆగస్టు నుంచి ఈ ప్రకటనను కేంద్ర సమాచార శాఖ తప్పనిసరి చేసిన విషయం విదితమే. అయితే ఈ ప్రకటనలో అక్షయ్ కుమార్ తో పాటు ఒక వ్యక్తి విశేషంగా ఆకట్టుకున్నాడు. అతనే నందు ఉరఫ్ అజయ్పాల్. ఇటీవల బాలీవుడ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి ప్రకటనకు సంబంధించిన వివరాలు వెల్లడించగా.. చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ యాడ్ లో నటించే అవకాశం అంత తేలిగ్గా రాలేదని- ఇది తనకు పెద్ద పరీక్ష పెట్టిందని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను భోపాల్ లో ఉండగా `ప్యాడ్ మ్యాన్` కాస్టింగ్ డైరెక్టర్ శ్రుతి మహాజన్ వచ్చారని.. ఆ సమయం లో ముంబయ్ నటులను కాదని.. స్థానికులకే అవకాశం ఇవ్వాలని భావించారని చెప్పారు. ఆ విధంగా తనకు అవకాశం రాగా.. అనంతరం ధూమపానం యాడ్ లోనూ ఛాన్స్ వచ్చినట్లు వివరించారు.

అయితే తనకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సహకారంతోనే నందు పాత్రకు న్యాయం చేయగలిగానని పేర్కొన్నారు. మరో వైపు ఈ యాడ్ లో ప్రత్యేకత ఏంటంటే తనకు అక్షయ్ కుమార్ మధ్య షూట్ కు నాలుగు గంటలు పట్టిందట. దీని కోసం కనీసం 30 నుంచి 35 సిగరెట్లు తాగాల్సి వచ్చిందని వివరించారు. అయితే మొదట్లో తన చేతిలో సిగరెట్ మాత్రమే ఉందని.. ఇది అంతగా వర్కవుట్ కాక పోవడంతో సిగరెట్ తాగాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. అయితే వీరి కష్టం ఊరికే పోలేదు. ఈ ప్రకటన కారణంగా సమాజంలో అనేక మంది చైతన్యవంతమవుతున్నారని నెటిజనం అభినందనలు చెబుతున్నారు. పొగతాగని వాడు దున్నపోతు కాదా కిలాడీ! అని అక్షయ్ ని ప్రశ్నించాల్సిన పనే లేదు. మంచికి నేను సైతం అంటూ అతడు నిరంతరం ఏదో ఒక సామాజిక అంశాన్ని జనంలోకి తీసుకెళుతుండడంపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. యాంటీ స్మోకింగ్ యాడ్ (ధూమపాన నిషేధం) లో నటించిన కిలాడీ అక్షయ్ కుమార్ అతడి బృందంపై నెటిజనుల్లో మెచ్చుకోలు వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-