మన్మధుడు 2 :టీజర్ టాక్

0

అక్కినేని అభిమానులకే కాదు సినిమా ప్రేమికులకు కూడా ఎవర్ గ్రీన్ ఎంటర్ టైనర్ గా నిలిచిపోయిన మన్మథుడు సీక్వెల్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొంది విడుదలకు రెడీ అవుతోంది. గత నెల రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు హీరోయిన్ అవంతిక పాత్రను చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ కొత్త వీడియో వదిలారు. అందులో అవంతిక పాత్ర స్వభావాన్ని అరటిపండు వలిచినట్టు చూపించేశారు.

లేట్ ఏజ్ అయినా పెళ్లి కాకుండా మిగిలిపోయిన నాగ్ ను టార్గెట్ చేసుకుని ముందు అతని తల్లి(లక్ష్మి)ని టార్గెట్ చేస్తుంది అవంతిక. పద్ధతికి మారుపేరుగా సంప్రదాయం ఉట్టిపడుతున్న లక్షణాలతో అందరిని ఇట్టే ఆకట్టుకుంటుంది . కాని తీరా నాగ్ దగ్గర మాత్రం తనలో అసలు కోణం బయటికి తీస్తుంది. వాళ్ళందరికీ యు సర్టిఫికేట్ సినిమా చూపించి నాగ్ కు అడల్స్ మూవీ ఓపెన్ చేస్తుంది. అసలు అవంతిక ఇలా రెండు షేడ్స్ లో ఎందుకు కనిపించింది మన్మధుడికి తనకు కనెక్షన్ ఏంటి అనేది తెరమీద చూడాల్సిందే

రకుల్ ని ఉద్దేశించి టీజర్ కట్ చేశారు కాబట్టి కాన్సెప్ట్ మొత్తం తన చుట్టే తిరుగుతుంది. వెన్నెల కిషోర్ తన గురించి పాజిటివ్ గా చెబుతున్నప్పుడు నాగ్ బొంగేం కాదు అంటూ చెప్పడం చూస్తే కామెడీ టైమింగ్ లో ఘాటు ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. రకుల్ యధావిదిగా గ్లామర్ గా ఉంది. ఈ వయసులో లవ్ బ్రేక్ అప్ అయితే తట్టుకోలేవు అంటూ నాగార్జున తన మీద తానే మరోసారి జోక్ వేసుకోవడం విశేషం. మొత్తానికి మన్మధుడు 2లో అవంతికది రెగ్యులర్ హీరొయిన్ కాకుండా మంచి వెయిట్ ఉన్న పాత్రని అర్థమైపోయింది. ఆగస్ట్ 9 న విడుదల కానున్న మన్మధుడు 2 మీద అంచనాలు భారీగా ఉన్నాయి
Please Read Disclaimer