మీటూ : వదిలేలా లేదు మళ్లీ కొత్త ఆరోపణ

0

చాలా కాలంగా హాలీవుడ్ తో పాటు కొన్ని ఇతర దేశాల్లో మీటూ ఉద్యమం సాగుతోంది. కాని ఇండియాలో మాత్రం గత ఏడాది ఆరంభం అయ్యింది. ఇండియాలో మీటూ ఆరంభంకు ప్రధాన కారణం తనూశ్రీ దత్తా. ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని భయపెట్టించిన మీటూ ఉద్యమంను మొదలు పెట్టిన తనూశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్ పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దాదాపు పదేళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ సందర్బంగా అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె ఆరోపించింది.

తనూశ్రీ దత్తా ఆరోపణల నేపథ్యంలో పోలీసు కేసు కూడా నమోదు అయ్యింది. నానా పటేకర్ ను పోలీసులు ప్రశ్నించడం సాక్ష్యులను విచారించడం జరిగింది. మీటూ ఆరోపణలు చేసి విదేశాలకు వెళ్లి పోయిన తనూశ్రీ దత్తా అప్పుడప్పుడు మర్చి పోకుండా ఈ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంది. ఇటీవల ఇండియాలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తనూశ్రీ దత్తా మరోసారి నానా పటేకర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది.

ఆ నటుడు నాకు అనుకూలంగా ఉన్న సాక్ష్యులను భయపెడుతున్నాడు. ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దట. ఎవరైనా కాదని చెప్తే వారిపై సీరియస్ గా చర్యలు ఉంటాయని బెదిరిస్తున్నాడట. అందుకే చాలా మంది సాక్ష్యులు ఉన్నా కూడా ఎవరు కూడా ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు రావడం లేదు అంటూ తనూశ్రీ దత్తా మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసింది.

నానా పటేకర్ కేసు తుది దశకు వచ్చింది. పోలీసులు చాలా మందిని విచారించి.. పలు కోణాల్లో ఎంక్వౌరీ చేశారు. ఇప్పటికే నానా పటేకర్ కు క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. తనూశ్రీ దత్తా తనపై చేసిన ఆరోపణలకు క్లీన్ చీట్ ఇవ్వాలంటూ నానా కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. అతి త్వరలోనే నానా పటేకర్ కు కోర్టు కూడా క్లీన్ చీట్ ఇస్తుందని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి సమయంలో అనూహ్యంగా తనూశ్రీ దత్తా సాక్ష్యులను భయపెడుతున్నాడు అంటూ వ్యాఖ్యలు చేయడంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నానా పటేకర్ పై తనూ శ్రీదత్తా మరీ పగ పట్టినట్లుగా ఆయనపై ఆరోపణలు చేస్తుందంటూ బాలీవుడ్ వర్గాల్లో కొందరు చర్చించుకుంటున్నారు.
Please Read Disclaimer