మెగా 152 సిట్టింగ్స్ ఇంట్రెస్టింగ్ న్యూస్

0

మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం విడుదలకు ముందే కొరటాల శివతో సినిమా కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. అసలు సైరా విడుదలకు ముందే చిరు 152 ప్రారంభం అవుతుందని ప్రచారం జరిగింది. అయితే సైరా భారీ సినిమా అవ్వడం వల్ల రెండు సినిమాలను ఒకేసారి చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో కొరటాల శివను వెయిట్ చేయించారు. సైరా విడుదలైన వెంటనే శివకు చిరంజీవి డేట్లు ఇస్తాడనుకుంటే మళ్లీ ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఇంకెప్పుడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొరటాల శివ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ ను చిరంజీవికి అతడు ఇస్తాడంటూ మెగా ఫ్యాన్స్ చాలా బలంగా నమ్ముతున్నారు. అందుకే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆతృత వారిలో కనిపిస్తుంది. సైరా తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న చిరంజీవి ఎట్టకేలకు మళ్లీ తదుపరి చిత్రం కోసం బిజీ అయ్యాడు. మొన్నటి వరకు హైదరాబాద్ లోనే ఉన్న చిరంజీవి ఇటీవలే బ్యాంకాక్ వెళ్లాడు. ఇంతకు ముందే అక్కడకు వెళ్లిన కొరటాల మరియు మణిశర్మలతో చిరంజీవి జత కలిసినట్లుగా సమాచారం అందుతోంది.

బ్యాంకాక్ లోని ఒక ప్రశాంతమైన రిసార్ట్ లో మెగా 152కు సంబంధించిన సిట్టింగ్స్ జరుగుతున్నాయట. ఇప్పటికే స్టోరీ సిట్టింగ్స్ పూర్తి చేసి స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన దర్శకుడు కొరటాల శివ వారం రెండు వారాల్లో మ్యూజిక్ సిట్టింగ్స్ ను కూడా పూర్తి చేసే యోచనలో ఉన్నాడట. ప్రస్తుతం బ్యాంకాక్ లో చాలా సీరియస్ గా ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ తర్వాత వెంటనే షూటింగ్ కు రెడీ అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. రామ్ చరణ్ తో పాటు మ్యాటీ మూవీస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది దసరాకు సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
Please Read Disclaimer