60 ప్లస్ లో మెగా ఛాలెంజ్

0

నాలుగు పదుల వయసు కే జిమ్ముల్లో కఠిన వ్యాయామం అంటే బహు దూరం అంటూ లేజీ గా ఉండేవాళ్లు ఉన్నారు. అయితే 60 ప్లస్ లోనూ మెగా బాస్ హార్డ్ వర్క్ సర్ ప్రైజ్ ఇస్తోంది. వయసు తో పనేం ఉంది మనసుండా లే కానీ! బాస్ వర్కవుట్ చూస్తుంటే.. ఇది మెగా ఛాలెంజ్ అని అనాలా లేక మెగా తపస్సు అనాలా ?

అలుపన్నదే లేకుండా నిరంతర శ్రామికుడి లా తపించాలి అన్నది చిరు తత్వం. ఈ వయసులోనూ ఆయన సూపర్ స్టార్ గా కంబ్యాక్ అయిన తీరు.. ఖైదీనంబర్ 150 తో ఒక డెబ్యూ హీరోలా హార్డ్ వర్క్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. దర్శకరత్న కీ.శే డా. దాసరి నారాయణరావు అంతటి వారే షాక్ తిన్నానని అన్నారు. ఇప్పటికే 64 వయసు.. అయినా ఆయన ఎక్కడా తగ్గడం లేదు. జిమ్ముల్లో నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. కంబ్యాక్ లోనూ కుర్ర హీరోలకు ధీటుగా పోటీనిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటాడుతున్నారు. ఖైదీ నంబర్ 150తో నాన్ బాహుబలి రికార్డుల్ని వేటాడారంటే మెగా స్టార్ స్టామినా ఎంతో అందరికీ మరోసారి అర్థమైంది. సైరా-నరసింహా రెడ్డి లో ఒక వారియర్ కింగ్ పాత్రలో అదరగొట్టారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్ర కోసం మెగా స్టార్ ఎంతగా శ్రమించారో తెరపై చూస్తే అర్థమైంది. ఆ రూపం కోసం జిమ్ముల్లో కఠిన వ్యాయామం చేశారు చిరు.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో సోషియో పొలిటికల్ డ్రామా లో నటించేందుకు రెడీ అవుతున్నారు. మెగా స్టార్ 152 గా చెబుతున్న ఈ సినిమా లోనూ స్మార్ట్ లుక్ తో కనిపించనున్నారు. అందుకే ఈ హార్డ్ వర్క్. ప్రత్యేకించి సెలబ్రిటీ ట్రైనర్ సమక్షంలో ఇలా బైసెప్.. ట్రైసెప్ అంటూ జిమ్ లో కుస్తీలు పడుతున్నారు. స్టార్ డమ్ ని నిలబెట్టుకోవాలంటే రూపం మన కంట్రోల్ లో ఉండాలి. అందుకే ఇంత కఠినంగా వ్యాయామం చేస్తున్నారు చిరు. ఈ యాటిట్యూడ్.. తపన వల్లనే.. ఆయన ఇండస్ట్రీని మెగా బాస్ గా ఏల్తున్నారు.
Please Read Disclaimer