మెగాడాటర్ మెరుపులు విరుపులు

0

తెలుగు సినిమాల్లో మెగా నేపథ్యం నుంచి వచ్చి జయాపజయాలకి వెరవక ముందుకు సాగుతున్న ఏకైక స్టార్ కిడ్ మెగా డాటర్ నిహారిక కొణిదెల. నటిగా సోలో చిత్రాల్లో బ్లాక్ బస్టర్లు అందుకోకపోయినా నటిగా నిరూపించుకుంది. వ్యక్తిగత వ్యవహార శైలిలో విభిన్నంగా కనిపిస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఇటీవల నాగబాబు బర్త్ డే బాష్ లోనూ..మెగాస్టార్ ఇంట్లో జరిగిన దివాళీ హంగామాలోనూ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్న నిహారిక తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటో వైరల్ గా మారింది.

రెట్రో లుక్ లో నెటిజన్స్ ని టెంప్ట్ చేస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. బ్లాక్ సిల్కీ డ్రెస్ లో తొలి తరం ఫోన్ రిసీవర్ ని పట్టుకుని నిహారిక ఇచ్చిన రెట్రో పోజు నెటిజన్స్ మదిలో కలకలం రేపుతోంది. ఈ లుక్ లో నిహారికని చూసిన వారంతా హల్లో ఇది 2019నా? లేక 1920నా ? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇలా నిరంతరం మెరుపులు మెరిపిస్తున్న నిహారిక మెరుపుల్ని సోషల్ మీడియాకే పరిమితం చేస్తుందా? లేక వెండి తెరకు కూడా విస్తరించి ఆడియన్స్ మతిపోగొడుతుందా? అని నెటిజన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేదూ నాలుగేళ్ల వరకే నటన.. ఆ తర్వాత పెళ్లి అంటూ డాడ్ పెట్టిన కండిషన్ ప్రకారం నిహారిక మాటకు కట్టుబడుతోందా అన్నది చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-