మెగా డాటర్ ప్రైడ్ మూమెంట్

0

మెగా ఫ్యామిలీ నుండి నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఏకైక నటి నిహారిక. హీరోయిన్ గా ఈమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఆడకపోయినా కూడా నటిగా మాత్రం మంచి మార్కులు దక్కించుకుంది. ఎప్పటికైనా పెదనాన్న చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరుకున్న నిహారిక సైరా నరసింహారెడ్డిలో ఆ కలను తీర్చుకుంది. సైరా చిత్రంలో నిహారిక చేసింది చిన్న పాత్ర అయినా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. సైరా చిత్రంకు ఫ్యాన్స్ నుండే కాకుండా ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ టాక్ వస్తుంది.

సైరా సినిమా సూపర్ హిట్ అంటూ టాక్ వచ్చిన నేపథ్యంలో నిహారిక ట్విట్టర్ లో ఈ ఫొటోను పోస్ట్ చేసి.. నేను హగ్ చేసుకుంది కేవలం డాడిని మాత్రమే కాదు.. ఒక ఇండియన్ సినిమా ప్రైడ్ ను అంది. నేను ఎప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ గా చెప్పుకునేందుకు గర్వ పడతానంది. లవ్ యు డాడీ అంటూ నిహారిక బ్లాక్ బస్టర్ హ్యాష్ ట్యాగ్ ను యాడ్ చేసింది. సైరాలో చిన్న పాత్రను చేసినా కూడా నిహారిక కళ్లలో ఆనందంను క్లీయర్ గా చూడవచ్చు.

ఇలాంటి గొప్ప సినిమాలు.. పెద్ద సినిమాల్లో చిన్న పాత్రను చేసేందుకు కూడా చాలా మంది ఎంతో ఆసక్తిగా ఉంటారు. అలాంటి అవకాశం తనకు రావడం పట్ల ఆమె చాలా సంతోషంను వ్యక్తం చేసింది. ప్రస్తుతం నిహారిక ఒక వెబ్ సిరీస్ ను చేస్తోంది. ఆ వెబ్ సిరీస్ ను నిర్మించడంతో పాటు ఆ వెబ్ సిరీస్ లో స్వయంగా నటిస్తోంది. గతంలో కూడా ఒక వెబ్ సిరీస్ ను నటించి నిర్మించిన నిహారిక మళ్లీ హీరోయిన్ గా ఎప్పుడు చేస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.