మంచు ఫ్యామిలీతో మెగా దీపావళి

0

దీపావళి సందర్భంగా మంచు విష్ణు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను ప్రత్యేకంగా పార్టీకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మంచు ఫ్యామిలీతో స్నేహం నెరిపిన సినీప్రముఖులంతా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. ప్రభాస్- విష్ణు కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేస్తూ ‘నా సోదరుడు.. ఇలా సూపర్ ఫన్నీగా ఉదయం .. సాయంత్రం గడిపి చాలా కాలం అయింది’ అంటూ విష్ణు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రభాస్ – విష్ణు ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని మాట్లాడుకోవడాన్ని బట్టి ఆ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అన్నది అర్ధమైంది. మరి వీళ్లిద్దరి స్నేహం ఎప్పుడు మొదలైందంటే ‘బుజ్జిగాడు’ చిత్రం నుంచి .

మోహన్ బాబు ఆ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రభాస్-విష్ణు మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఇక తాజాగా మంచు వారింట మెగాస్టార్ చిరంజీవి కూడా మెరిసారు. దానికి సంబంధించిన ఫోటోలు కాస్త ఆలస్యంగా వెలుగు లోకి వచ్చాయి.

మనందరికీ ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి అంకుల్ కు నా కుమార్తె ఐరా విద్యను పరిచయం చేసానని ఇన్ స్టా ఖాతా ద్వారా విష్ణు తెలిపాడు. అలాగే చిరంజీవి ఐరా విద్యను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడిస్తున్న పిక్ ను విష్ణు షేర్ చేసి మురిసిపోయాడు. మంచు వారసులు విష్ణు-మనోజ్- లక్ష్మి ప్రసన్న మెగా ఫ్యామిలీతో చక్కని స్నేహం కొనసాగించేందుకు ప్రతిసారీ ఆసక్తిని కనబరుస్తారన్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer