AMB లో మెగా చిలౌట్ చూశారా!

0

మెగా హీరోలంతా ఒకే చోట కలుసుకుంటే ఎలా ఉంటుంది? మెగాస్ అల్లూస్ అంటూ విడదీసి కామెంట్లు చేసేవాళ్లకు సర్ ప్రైజింగ్ గానే ఉంటుంది మరి! అవును అలాంటి దృశ్యమే లేటెస్టుగా కనిపించింది. మెగా అల్లు హీరోలంతా ఓ చోట చేరి సందడి చేశారు. అది కూడా మహేష్ ఏఎంబీ థియేటర్ కి వెళ్లి అంతా సినిమా చూసొచ్చారు.

ఏఎంబీలో సందడి చేసిన హీరోలు ఎవరెవరు? అంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- అల్లు శిరీష్ బ్రదర్స్.. మెగా ప్రిన్స్ వరణ్ తేజ్.. మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి తేజ్.. వీళ్లంతా ఓచోట చేరి మామూలుగా రచ్చ చేయలేదు. ఇక ఇదే బృందంలో బన్ని సోదరుడు అల్లు బాబి ఉన్నాడు. మెగా ప్రిన్సెస్ నీహారిక.. మెగాస్టార్ కుమార్తెలు సుశ్మిత- శ్రీజ.. వీళ్లతో పాటే మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ఏఎంబీలో సినిమా చూసిన బ్యాచ్ లో ఉన్నారు.

ఓవైపు బిజీబిజీ షెడ్యూల్స్.. మరోవైపు చిలౌట్ పార్టీలు ఇదీ మెగా ప్లానింగ్. ప్రతిసారీ పండగలు పబ్బాలు వచ్చినప్పుడు కలుస్తున్నారు. సినిమాల్ని జాయింట్ వెంచర్లుగా ప్లాన్ చేస్తున్నారు. అల్లు కాంపౌండ్ లోని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మెగా హీరోలు నటించే సన్నాహాల్లో ఉన్నారు. ఇక బన్ని.. వరుణ్ తేజ్.. సాయి తేజ్.. వీళ్లంతా కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా .. ఇలా ఇంట్లో అందరితో టైమ్ స్పెండ్ చేయడం జాలీగా గడిపేయడం అన్నది ఆసక్తికరం.




Please Read Disclaimer