బ్లాక్ డ్రెస్ కోడ్ తో మెగా సర్ ప్రైజ్

0

మెగా కాంపౌండ్ లో థీమ్ పార్టీల ట్రెండ్ ఇప్పటిది కాదు. ప్రతిసారీ సందర్భానుసారం కుటుంబంలోని సభ్యులంతా ఒకచోట కలుసుకునేలా సరదాగా టైమ్ స్పెండ్ చేసేలా మెగా ప్లానింగ్ తో ఏదో ఒక సందడి నిరంతరం ఉంటుంది. అయితే మీడియా గ్లేర్ లేకుండా ప్రయివేటుగా సెలబ్రేషన్స్ జరుపుకోవాలని అనుకుంటారు. పార్టీ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం ద్వారా రివీల్ చేస్తుంటారు.

తాజాగా మెగా కాంపౌండ్ నుంచి ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో కుటుంబ సభ్యులంతా బ్లాక్ డ్రెస్ కోడ్ తో స్పెషల్ థీమ్ ని ఎలివేట్ చేశారు. ఇంతకీ ఏంటి అంత ప్రత్యేక సందర్భం అంటే మెగా బ్రదర్ నాగబాబు బర్త్ డే. మొన్ననే దీపావళి సెలబ్రేషన్స్ కోసం కుటుంబ సభ్యులంతా ఓ చోటికి చేరి పార్టీలతో సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఈలోగానే నాగబాబు బర్త్ డే కోసం మరోసారి కుటుంబ సభ్యులంతా కలిశారు. ఈ పార్టీ థీమ్ కోడ్ గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి-సురేఖ- రామ్ చరణ్- నాగబాబు-వరుణ్ తేజ్- నిహారిక- బాబి- కళ్యాణ్ దేవ్- సుస్మిత- శ్రీజ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో మెగా ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ కోఆర్డినేటర్ నాగబాబు పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇంటిల్లిపాదీ పండగలు పబ్బాల వేళ .. ఫ్యామిలీ ఫంక్షన్లలో ఓ చోట కలుసుకుంటే ఆ సందడే వేరు. ఆ అందం వేరు.. ఆనందం వేరు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ఈ ఎపిసోడ్స్ ని ఆస్వాధిస్తోంది.
Please Read Disclaimer