మిల్కీ బ్యూటీ వ్యాఖ్యలకు మెగా ఫ్యాన్స్ కౌంటర్

0

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ అవ్వబోతున్న విషయం తెల్సిందే. నిన్న ఈ రీమేక్ పూజా కార్యక్రమాలు లాంచనంగా జరిగాయి. భోళా శంకర్ అనే టైటిల్ తో రూపొందబోతున్న ఈ సినిమా లో తమన్నా హీరోయిన్ గా నటించబోతుంది.

కీర్తి సురేష్ కీలకమైన చిరు చెల్లి పాత్రలో నటిస్తున్న విషయం ఇప్పటికే కొన్ని నెలల ముందు ప్రకటించారు. ఇప్పుడు హీరోయిన్ గా తమన్నాను కన్ఫర్మ్ చేసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమా గురించి ఇటీవల తమన్నా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు మెగా వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. కొందరు మెగా అభిమానులు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతుంటే మరి కొందరు మాత్రం ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు.

తమన్నా భోళా శంకర్ పూజా కార్యక్రమాల సందర్బంగా మాట్లాడుతూ మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎప్పుడో నటించాల్సి ఉంది.. కాని కొన్ని కారణాల వల్ల నటించలేక పోయాను. ఆయన దర్శకత్వంలో మళ్లీ ఇన్నాళ్లకు నటిస్తున్నాను. ఈ కథలో మీరే నటించాలంటూ ఆయన నా వద్దకు వచ్చిన సమయంలో కాదనలేక పోయాను.

ఎంతో బిజీగా ఉన్నా కూడా మనపై నమ్మకంతో వచ్చినప్పుడు ఎలా కాదనగలం అన్నట్లుగా తమన్నా వ్యాఖ్యలు చేసింది. తాను చాలా బిజీగా ఉన్నా కూడా కథ మరియు పాత్ర నచ్చడం వల్ల నటించేందుకు కమిట్ అయ్యాను అన్నట్లుగా తమన్నా చెప్పుకొచ్చింది. ఇది చిరంజీవి సినిమా అవ్వడం వల్ల నటించడం లేదు అన్నట్లుగా అర్థం ఉన్న ఆమె వ్యాఖ్యలకు కొందరు మెగా ఫ్యాన్స్ గట్టిగానే స్పందిస్తున్నారు.

గత మూడు నాలుగు ఏళ్లుగా ఆఫర్లు లేక చిన్నా చితకా సినిమాలు వెబ్ సిరీస్ లు చేసుకుంటూ ఒకానొక సమయంలో ఆ ఆఫర్లు కూడా లేక పోవడంతో బుల్లి తెరపైకి వెళ్లిన నువ్వు ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో నటించేందుకు అంతగా ఆలోచించావా అంటున్నారు.

ఇప్పుడు నువ్వు చేస్తున్న సినిమాలు ఏంటీ అంత బిజీగా ఉండటానికి అంటూ మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మెగాస్టార్ సినిమా కంటే ఆ సినిమాలు నీకు ఎక్కువనా అంటూ కొందరు తమన్నాను ప్రశ్నిస్తున్నారు. కెరీర్ ముగింపు దశలో ఉన్న నీకు మెగా స్టార్ ఇంత మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు మాట్లాడాల్సిన మాటలేనా అంటూ ఆమెను తీవ్రంగా తప్పుబడుతున్నారు.

నిజానికి తమన్నా ఈమద్య అంత బిజీగా ఏమీ లేదు. అయినా కూడా భోళా శంకర్ సినిమాలో చాలా కష్టంగా నటించేందుకు ఒప్పుకున్నట్లుగా ఆమె చెప్పడం విడ్డూరంగా ఉందని మీడియా వర్గాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.