మెగా అభిమానులకు నిజమైన పండగ

0

మెగా అభిమానులకు ఈ ఇండిపెండెన్స్ డే మరింత స్పెషల్ గా మారింది. దీనికి కారణం మెగా హీరోల ఆప్కమింగ్ సినిమాల తాలూకూ టీజర్స్. స్వాతంత్ర దినోత్సవంతో పాటు రాఖీ పౌర్ణమి కూడా కలిసి రావడంతో మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు మెగా హీరోలు. మెగాస్టార్ చిరు బన్నీ వరుణ్ తేజ్ ముగ్గురు ఫ్యాన్స్ కి డబుల్ ఫెస్టివల్ మూడ్ తీసుకొచ్చారు.

నిన్న మెగాస్టార్ నటిస్తున్న మోస్ట్ ఏవైటింగ్ ‘సైరా నర్సింహ రెడ్డి’ మేకింగ్ వీడియో వదిలాడు. ప్రస్తుతం ఆ వీడియో యూ ట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంది. ఈరోజు ఉదయం అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా టైటిల్ రిలీజ్ చేసి తన గ్యాప్ గురించి ఓ డైలాగ్ తో టీజర్ రిలీజ్ చేసాడు. ఇక సాయంకాలం వరుణ్ బరిలోగి దిగాడు తన నెక్స్ట్ సినిమా ‘వాల్మీకి’ టీజర్ ని రిలీజ్ చేసాడు. ఈ మూడు వీడియోస్ మెగా ఫ్యాన్స్ లో కొత్త జోష్ తీసుకొచ్చి మరింత ఆనందింపజేశాయి.

ప్రస్తుతం ఈ వీడియోస్ తో పండగ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇక వరుణ్ ‘వాల్మీకి’ సెప్టెంబర్ 13 న రిలీజ్ కానుంది. మెగా స్టార్ ‘సైరా’ అక్టోబర్ 2న థియేటర్స్ లోకి వస్తుంది. బన్నీ ‘అల వైకుంఠపురములో’ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది.ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు చూస్తామా..? అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్.
Please Read Disclaimer