యంగ్ హీరో కి మెగా ప్రమోషన్

0

యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా నటిస్తోన్న అర్జున్ సురవరం ఎట్టకేలకు అన్ని అవాంతరాలు దాటుకుని ఈనెల 29న ప్రేక్షకుల ముందుకొస్తుంది. రిలీజ్ విషయంలో పలుమార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఈ తేదీకైనా రిలీజ్ అవుతుందా? లేదా? అన్న దానిపై కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ నిఖిల్ పక్కాగా వచ్చేస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే సోషల్ మీడియా లో చిత్రయూనిట్ ప్రమోట్ చేస్తోంది. వచ్చే వారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సన్నాహాకాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ముఖ్య అతిథిగా మోగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించినట్లు సమాచారం.

ఇటీవలే చిరుకు అర్జున్ సురవరం ను చూపించారుట. చిరుకు సినిమా బాగా నచ్చిందిట. దీంతో ఆయన సినిమా ప్రచారానికి కావాల్సిన తన వంతు సహకారం అందిస్తానని ప్రామిస్ చేసారుట. ఈ నేపథ్యం లోనే ప్రీ రిలీజ్ కు మెగాస్టార్ ను అతిధిగా ఆహ్వానించినట్లు వినిపిస్తోంది. ఇక చిరంజీవి చిన్న సినిమాలను ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇటీవల కాలంలో చిన్న బడ్జెట్ సినిమాల కు ఎంతో విలువైన తన సమయాన్ని కేటాయిస్తున్నారు. చిన్న సినిమాల ప్రమోషన్ వేదికగా చిరు ఇల్లు అడ్డాగా మారిపోయింది. మెగాస్టార్ పరిశ్రమలో పెద్దన్న తరహా పాత్ర పోషించం పై సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలు చిన్న సినిమాల్ని చిరు ప్రోత్సహించారు. మొన్న శుక్రవారం రిలీజైన జార్జిరెడ్డి చిత్రానికి ఆయన ప్రమోషన్ చేసిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer