సాయి తేజ్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?

0

ప్రతి ఒక్కరికీ ఇష్టాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికీ ఇష్టమైన హీరోలు ఉంటారు.. హీరోయిన్లు ఉంటారు. వర్మ గారిని అడిగితే అలుపు సొలుపు లేకుండా శ్రీదేవి గురించి అనర్గళం గా ఆరు గంటలు స్పీచ్ ఇస్తాడు. ఆయన ప్రేమాభిమానాలు అలాంటివి. ఆయనే కాదు చాలా మందికి ఫేవరెట్ హీరోలు.. హీరోయిన్లు ఉంటారు. అందరికీ శ్రీదేవి ఫేవరెట్ అయి ఉండక పోవచ్చు.. కొందరికి పూజా హెగ్డే అయి ఉండొచ్చు.. కొందరికి రష్మిక అయి ఉండొచ్చు. మరి ఈమధ్యే ‘ప్రతిరోజూ పండగే’ తో హిట్టు సాధించిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరు?

ఈమధ్యే ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ తనకిష్టమైన హీరోయిన్ సయామీ ఖేర్ అని చెప్పాడు. ఈ పేరు చెప్పగానే ఎక్కువ మంది ఎవరు? అని అడిగే అవకాశం ఉంది. సాయి ధరమ్ తేజ్ లాంచ్ ఫిలిం(రిలీజ్ మాత్రం పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత అయింది) ‘రేయ్’ లో సయామీ ఖేర్ హీరోయిన్. ఎక్కువ సినిమాలు చెయ్యలేదు పెద్దగా గుర్తింపు దక్కలేదు. హిందీలో ‘మిర్జియా’ అనే చిత్రం లో కూడా నటించింది. ఎంతో మంది హీరోయిన్లు ఉండగా ఈ మెగా హీరో సయామీ పేరు ఎందుకు చెప్పినట్టు? ఆ విషయం చెప్తూ తన డెబ్యూ సినిమా హీరోయిన్ కదా.. అందుకే ఆ హీరోయిన్ అంటే ఇష్టం అని నవ్వేశాడు.

అయితే తేజు ఈ పేరు చెప్పడం మాత్రం చాలామందికి సర్ ప్రైజ్ ఇవ్వడం ఖాయమే. చాలామంది కూల్ గా ఉంటుందని స్టైల్ గా హాలీవుడ్ హీరోయిన్ పేర్లు కూడా చెప్తుంటారు. కానీ తేజు మాత్రం ఎవరూ ఊహించని సమాధానం చెప్పాడు. ఇక తేజు ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే రొమాంటిక్ కామెడీ లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో సుబ్బు అనే నూతన దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.
Please Read Disclaimer