సెట్స్ పైకి వెళ్లిన మొదటి మెగా హీరో

0

దాదాపు మూడు నెలల విరామం తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ చేసుకోవచ్చు అంటూ అనుమతులు ఇచ్చిన విషయం తెల్సిందే. దేశ వ్యాప్తంగా షూటింగ్స్ పున: ప్రారంభం అయ్యాయి. అయితే తెలుగు స్టార్ హీరోల సినిమాలు మాత్రం ఇంకా షూటింగ్ ప్రారంభం కావడం లేదు. కొన్ని సీరియల్స్ ఇంకా చిన్న సినిమాలు వెబ్ సిరీస్ లు మాత్రమే చిత్రీకరణ జరుగుతున్నాయి. తాజాగా మెగా హీరో కళ్యాణ్ దేవ్ మూవీ ‘సూపర్ మచ్చి’ షూటింగ్ పున: ప్రారంభం అయ్యింది.మెగా హీరోల్లో ఇప్పటి వరకు ఎవరు కూడా సెట్స్ పైకి వెళ్లింది లేదు. వకీల్ సాబ్ చిత్రీకరణ ప్రారంభం అయినట్లుగా వార్తలు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ కాలేదన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ తో చరణ్ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. చిరంజీవి ఇప్పట్లో ఆచార్య చిత్రాన్ని మొదలు పెట్టే అవకాశం కనిపించడం లేదు. ఇక అల్లు అర్జున్ పుష్ప కూడా లేట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. వరుణ్ తేజ్ సాయిధరమ్ తేజ్ లు కూడా షూటింగ్స్ కు జాయిన్ అయ్యేందుకు సిద్దం అవుతున్నారు. అంతా జులై నుండి షూటింగ్స్ కు హాజరు అయ్యే అవకాశం ఉంది.

కాని మెగా ఫ్యామిలీ నుండి కళ్యాణ్ దేవ్ మాత్రమే మొదటగా షూటింగ్ కు హాజరు అయ్యాడు. ప్రభుత్వం పెట్టిన కండీషన్స్ కు లోబడే చిత్రంను షూట్ చేస్తున్నట్లుగా సూపర్ మచ్చి యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. యూనిట్ సభ్యుల కోసం పూర్తి స్థాయి భద్రత చర్యలు తీసుకున్న తర్వాతే షూటింగ్ ను మొదలు పెట్టినట్లుగా మేకర్స్ ప్రకటించారు. నేటి నుండి కళ్యాణ్ దేవ్.. రచిత రామ్ ఇంకా అజయ్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు తెలియజేశారు.
Please Read Disclaimer