త్రివిక్రమ్ ని వెంటాడుతున్న మెగా హీరోలు

0

త్రివిక్రమ్ ని మెగా హీరోలు వదిలేలా లేరు. ఇప్పటి వరకు ఈ మాటల మాంత్రికుడు పదకొండు సినిమాలకు దర్శకత్వం వహించగా.. అందులో ఆరు సినిమాలు మెగా హీరోలతోనే చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ తో జల్సా- అత్తారింటికి దారేది- అజ్ఞాతవాసి చిత్రాలు తీశారు. అల్లు అర్జున్ తో జులాయి- సన్నాఫ్ సత్యమూర్తి- అల వైకుంఠపురములో చిత్రాలను రూపొందించి అజ్ఞాతవాసి మినహా అన్ని సినిమాలతోనూ విజయాలను అందుకున్నారు. దీంతో త్రివిక్రమ్ ని మెగా హీరోలు వదిలేలా లేరని అర్థమవుతోంది. నెక్ట్స్ ఆయనతో సినిమాలు చేసేందుకు ఇప్పుడు మెగాస్టార్ నుంచి యంగ్ హీరోల వరకు అందరూ పోటీ పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన తో సినిమా చేయాలనుందని ఆ మధ్య చెప్పడం ఫ్యాన్స్ లో వాడి వేడి చర్చకు తావిచ్చింది.

ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో అరవింద సమేత తెరకెక్కి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా సినిమాని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. మేలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఎవరి తో అన్నది చర్చనీయాంశంగా మారింది. నెక్ట్స్ చిరంజీవి తో ఉంటుందనే వార్తలు వినిపించాయి. ఓ వేదికపై చిరంజీవి కూడా ఈ విషయాన్నిస్పష్టం చేశారు. అయితే ఇప్పుడు చిరునే కాదు… రామ్ చరణ్ కూడా మాటల మాంత్రికుడితో ఓ సినిమా చేయాలని ఉబలాటపడుతున్నాడట. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం త్రివిక్రమ్ తో నాలుగోసారి కలిసి పనిచేయాలని బలంగా కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆయన మూడు సినిమాలు లైన్ లో పెట్టగా త్వరగా అవి పూర్తి చేసి త్రివిక్రమ్ సినిమా చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.

మరోవైపు యువ మెగా హీరోలు కూడా త్రివిక్రమ్ తో ఒక్క సినిమా అయినా చేయాలని తపిస్తున్నట్టు సమాచారం. సాయితేజ్ – వరుణ్ తేజ్ కన్ను త్రివిక్రమునిపైనే ఉందట. ఇలా మెగా హీరోలు వరసగా ఆయన తో సినిమాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ లెక్కన త్రివిక్రమ్ ని మెగా హీరోలు వెంటాడుతున్నారనే చెప్పాలి. అయితే తరచూ మీరు కొందరితోనే సినిమాలు రిపీట్ చేస్తున్నారు. కొత్త వారితో చేయడం లేదనే కామెంట్ వినిపిస్తుంటుంది అని ప్రశ్నిస్తే.. దీనిపై ఆయన గతంలో స్పందిస్తూ నాకు వేవ్ లెన్త్ కుదిరిన వారితోనే సినిమాలు చేస్తానని స్పష్టం చేయడం విశేషం. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సినిమాలో పూజా హెగ్డే పేరు కథానాయికగా వినిపిస్తుంది. అలాగే బాలీవుడ్ హీరోయిన్లు అలియాభట్ పేరు సైతం వినిపిస్తుంది. మరి వీరిలో ఎవరిని ఫైనల్ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-