బాస్ ఈజ్ బ్యాక్.. 152 సెట్లో హల్ చల్

0

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడి గా నటించిన `సైరా – నరసింహారెడ్డి` పాన్ ఇండియా కేటగిరీలో రిలీజై రకరకాల పాఠాలు నేర్పించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్ల తో బాస్ కి ఏమాత్రం సీన్ తగ్గలేదని ప్రూవైంది. ఇక ఆ తర్వాత కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా గురించి అభిమానుల్లో ఆసక్తికర డిబేట్ రన్ అవుతోంది. అయితే ఇదిగో పులి అంటే అదిగో మేక! అన్న చందంగా ఇప్పటి వరకూ ఈ సినిమా ప్రారంభోత్సవం గురించి సరైన సమాచారం లేదు.

అయితే ఉన్నట్టుండి చిరు 152 మొదలై పోయింది అంటూ ఓ ఫోటో హల్ చల్ చేస్తుండడం ఆసక్తి రేపింది.
బాస్ ఈజ్ బ్యాక్ .. మెగాస్టార్ చిరంజీవి కొంత గ్యాప్ తర్వాత కొత్త సినిమాని ప్రారంభించేశారు. హైదరాబాద్ లో నేటి నుంచి చిరు షూటింగులో పాల్గొంటున్నారు అన్న ప్రచారం వేడెక్కిస్తోంది. అంతేకాదు.. చిరు లుక్ ఇదేనంటూ సోషల్ మీడియా లో ఒక ఫోటో జోరుగా వైరల్ అవుతోంది. గళ్ల చొక్కాలో చిరు ఎంతో స్మార్ట్ గా కనిపించారు ఈ ఫోటోలో.

ఇటీవల చాలా సినిమాల్ని ఇలానే సైలెంటు గా మొదలెట్టేస్తున్నారు. మొన్నటికి మొన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించే పింక్ రీమేక్ ని దిల్ రాజు కాంపౌండ్ లో ఎలాంటి హంగామా లేకుండానే ప్రారంభించేశారు. ఇప్పుడు చిరు సినిమాని అలానే మొదలెట్టేశారా? అన్న చర్చ మొదలైంది. ఇక 152 కోసం మెగాస్టార్ బరువు తగ్గడంతో పాటు చాలావరకూ మేకోవర్ అయ్యారు. కమర్షియల్ అంశాలు కలిగిన సామాజికాంశం తో తాజా చిత్రాన్ని కొరటాల తెరకెక్కిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేటి నుండి నిరవధికం గా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. 2020 ఆగస్టు 14న ఈ మూవీని విడుదల చేస్తారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే థాయిలాండ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer