తమ ప్రేమను బయట పెట్టిన మెగా స్టార్ – మోహన్ బాబు

0

టాలీవుడ్ లో చిరంజీవి -మోహన్ బాబు లను టాం అండ్ జెర్రీ అంటుంటారు. ఈ విషయాన్నీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఏ ఈవెంట్ లో కనిపించినా వీరిద్దరూ ఒకరి గురించి మరొకరు సరదాగా ఛలోక్తులు విసురుకుంటారు. అయితే తాజాగా మెగా స్టార్ -మోహన్ బాబుల మధ్య ఉన్న ప్రేమ మరోసారి బయటపడింది.

నిజానికి వీరిద్దరూ ఒకరి గురించి మరొకరు సరదాగా మాట్లాడుకున్నా ఫైనల్ గా తామిద్దరం ఒకటే అని చెప్పుకున్నారు. మా డైరీ ఆవిష్కరణలో మోహన్ బాబు చిరంజీవి కుటుంబం తన కుటుంబమని ఇద్దరం ఒకటే అన్నట్టుగా మాట్లాడాడు. దానికి స్పందించి చిరంజీవి వెంటనే మోహన్ బాబు ఆత్మీయ ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకున్నాడు.

అయితే మనుషల మధ్య సరసన ఉండాలని ఈగోకి వెళ్లకూడదని ఈ సందర్భం గా మోహన్ బాబు చెప్పుకున్నాడు. అయితే ఇదే ఈవెంట్ లో రాజశేఖర్ పరుచూరి గోపాలక్రిష్ణ దగ్గర మైక్ లాక్కొని మాట్లాడటం చిరంజీవిను ఉద్దేశించి మాట్లడటం మెగా స్టార్ కి ఆగ్రహం తెప్పించింది. ఫైనల్ గా ఈవెంట్ లో చిరు చిరు కోపం తెప్పించి లాంచ్ ను వాకౌట్ చేసాడు రాజశేఖర్.
Please Read Disclaimer