మెగాస్టార్ చేతుల మీదుగా ‘నమో’ ట్రైలర్

0

మలయాళ నటుడు జయరామ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. ఈ ఏడాది వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రంతో పాటు తెలుగులో మరియు తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించిన జయరామ్ తాజాగా ‘నమో’ అనే సంస్కృత చిత్రంలో నటించారు. ఈ చిత్రం ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ నటుడు జయరామ్ పై ప్రశంసలు కురిపించారు.

శ్రీకృష్ణుడి బాల్య మిత్రుడు అయిన కుచేలుడి పాత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజ్జిష్ మణి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అనస్వర చారిటబుల్ ట్రస్ట్ నిర్మిస్తున్నారు. ఇదో ప్రయోగాత్మక చిత్రంగా రూపొందింది. ఈ చిత్రం కోసం నటుడు జయరామ్ గుండు కొట్టించుకోవడంతో పాటు దాదాపుగా 15 కేజీల బరువును కూడా తగ్గాడట.

పూర్తి విభిన్నమైన మేకోవర్ తో జయరామ్ ఈ చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో జయరామ్ నటనకు మంచి మార్కులు పడటంతో పాటు అవార్డులు సైతం రావాలి. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలంటూ కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి ట్రైలర్ విడుదల సందర్బంగా ట్వీట్ చేశారు.