మెగాస్టార్ లుక్ టెస్ట్ అదిరింది అంటున్నారే!

0

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ఇప్పటికే లాంచ్ అయింది. ప్రీ ప్రొడక్షన్ కూడా దాదాపు పూర్తయిన సినిమాకు త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతోంది. వందశాతం సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉన్న కొరటాల మొదటిసారిగా చిరంజీవితో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల కూడా ఈ సినిమాను ఎలాగైనా హిట్ గా మలచాలని అనుకుంటున్నారట. అందుకే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదట.

ఈ సినిమాలో చిరంజీవి ఫిట్ గా కనిపించాలని కొరటాల కోరడంతో గత కొంతకాలంగా చిరు తన ఫిట్నెస్ పై వర్క్ చేస్తున్నారు. కఠినమైన డైట్ తో పాటు జిమ్ లో తీవ్రంగా శ్రమించి ఈ సినిమాకు కావాల్సిన విధంగా రెడీ అయ్యారట. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి మెగాస్టార్ కు లుక్ టెస్ట్ కూడా జరిగిందట. ఇందుకోసం ప్రత్యేకంగా ముంబై నుంచి స్టైలిస్టుల టీమ్ హైదరాబాద్ వచ్చారని.. చిరంజీవికి పాత్రకు సరిగ్గా సరిపోయేలా లుక్స్ ఫైనలైజ్ చేశారని సమాచారం. ఈ లుక్ టెస్ట్ తో అటు మెగాస్టార్.. ఇటు కొరటాల సంతృప్తిగా ఉన్నారట. ఇక మిగతా ప్రీ ప్రొడక్షన్ తో పాటుగా లుక్ టెస్ట్ కూడా పూర్తి కావడంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జనవరి 3 వ తారీఖునుంచి ప్రారంభించాలని చిరు సూచించారట.

మొదటి షెడ్యూల్ లో చిరంజీవి ఇంట్రో సీన్స్.. ఒక పాటను చిత్రీకరిస్తాని సమాచారం. ఈ సినిమాకు మణిశర్మను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారని తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకోసం మణి శర్మ మూడు ట్యూన్స్ ను రెడీ చేశారట. ఇందులో ఫస్ట్ షెడ్యూల్ లో షూట్ చేసే పాట కూడా ఉందని సమాచారం. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer