బిగ్ బాస్ 4 హోస్ట్ మెగా బాస్?

0

బిగ్ బాస్ తెలుగు మూడు సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేసిన సీజన్ 1.. నేచురల్ స్టార్ నాని హోస్టింగుతో సీజన్ 2.. కింగ్ నాగార్జున హోస్ట్ గా సీజన్ 3 మొత్తానికి జనహృదయాల్ని గెలిచాయి. బిగ్ బాస్ ఎమోషన్స్ తెలుగు లోగిళ్లలో మాస్ కి కనెక్టవ్వడంతో సాంప్రదాయ వాదులు వ్యతిరేకించినా విజయం సాధ్యమైంది. ఆదివారం సాయంత్రం సీజన్ 3 ముగింపు వేదికపై మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా సింగర్ రాహుల్ ట్రోఫీ అందుకుని విజేతగా నిలిచాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ ఎవరు? అంటూ అప్పుడే సోషల్ మీడియాలో కామన్ ఆడియెన్ లో హాట్ డిబేట్ మొదలైంది.

అంతేకాదు గ్రాండ్ ఫినాలే గెస్ట్ గా అలరించిన మెగా బాస్ చిరంజీవి అయితేనే రక్తి కడుతుందని ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిట్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ ఎపిసోడ్ ట్రీట్ కి ప్రశంసలు కురుస్తున్నాయి. మూడు నాలుగు గంటల పాటు సాగదీసిన ఈ చివరి ఎపిసోడ్ లోకి బాస్ ఎంట్రీ ఇవ్వగానే ఒక్కసారిగా జనాల్లో హుషారు వచ్చేసింది. ఇక మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చిన తీరు కానీ.. అక్కడ స్పాంటేనియస్ గా ఆయన వేసిన జోకులు పంచ్ లు ప్రతిదీ కడుపుబ్బా నవ్వించాయి. స్క్రిప్టుతో పని లేకుండా అదిరిపోయే టైమింగ్ తో చెలరేగిపోయిన చిరు హౌస్ పార్టిసిపెంట్స్ తో సరదా సంభాషణలతో రక్తి కట్టించారు. కొలీగ్ నాగార్జునపైనా సరదాగా సెటైర్లు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఆ కార్యక్రమం ఆద్యంతం మైమరిపించారు.

సెన్సాఫ్ హ్యూమర్ లో మెగాస్టార్ చిరంజీవిని కొట్టేవాళ్లే లేరు అని నిన్నటి ఎపిసోడ్ పక్కాగా ప్రూవ్ చేసింది. ఆయన ఇంటి సభ్యుల్ని ఒక్కొక్కరిని పేరు పేరునా పలకరిస్తూ .. చేసిన సందడి అంతా ఇంతా కాదు. ట్యాప్ విప్పే శివజ్యోతి అంటూ ఆట పట్టించినా.. బిత్తిరి సత్తిలా అనుకరించినా.. తమన్నా సింహాద్రి బలమైన వ్యక్తిత్వాన్ని పొగిడేసినా.. శ్రీముఖితో ఫన్నీ సెల్ఫీ స్కిట్ తో నవ్వులు పూయించినా మెగాస్టార్ కే చ చెల్లింది. ఇంటి సభ్యుల్లో ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో ఆయన వర్ణించిన తీరు అందరి పేర్లు గుర్తుంచుకున్న తీరు చూస్తుంటే వ్వావ్ అనకుండా ఉండలేం.

ఒకవేళ బిగ్ బాస్ 4 సీజన్ కి మెగాస్టార్ హోస్టింగ్ చేస్తే ఇండియాలోనే ది బెస్ట్ గా నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఎంత మైలేజ్ తెచ్చారో అంతకుమించి తేగలిగే సత్తా మెగా బాస్ కి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖైదీనంబర్ 150- సైరా నరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్లతో చిరు కంబ్యాక్ అదిరిపోయింది. మీలో ఎవరు కోటీశ్వరుడు? తర్వాత మరోసారి బుల్లితెరపైకి ఆయన హోస్ట్ గా ఆరంగేట్రం చేస్తారా? అన్నది ఇప్పటికి సస్పెన్స్. స్టార్ మాకి వెన్నంటి నిలిచే ఆయన కొత్త సీజన్ కి ఒప్పుకుంటారా? అన్నది చూడాలిPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home