లేడీ కెప్టెన్.. మెగా ఛాన్స్ జస్ట్ మిస్…!?

0

సున్నితమైన అంశాల్ని టచ్ చేస్తూ హ్యూమర్.. ఎమోషన్స్ ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించగలనని నిరూపించారు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి. అలా మొదలైంది చిత్రం తో కామెడీ టైమింగ్ తెలిసిన దర్శకురాలిగా ఐడెంటిటీ తెచ్చుకున్నారు. 2019లో ఓ బేబి తనకు మరో తీపి జ్ఞాపకం. ఈ చిత్రంతో చాలాకాలం తర్వాత ఓ సక్సెస్ దక్కింది. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ గా రూపొందించిన ఓ బేబి తో సమంత నటన కు పేరొచ్చింది. హిట్టు కొట్టాక నందిని రెడ్డి మరిన్ని అవకాశాలు అందుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నా ఎందుకనో ఇంకా ఏదీ ఓకే కావడం లేదట. ఇప్పటికే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేసి గతంలో మెగాస్టార్ చిరంజీవి కి వినిపించిన సంగతి తెలిసిందే. ఆ లవ్ స్టోరీ స్క్రిప్టు లో లోపాలున్నాయని.. మార్పు చేర్పులపై మెగాస్టార్ కొన్ని సూచనలు చేశారని ప్రచారమైంది. అయితే ఆ మేరకు మార్పులు చేశాక నందిని రెండోసారి చిరుని కలిశారట. అయినా ఏమైందో.. చిరును కన్విన్స్ చేయలేకపోయారని వార్తలొచ్చాయి. అప్పటికి చిరు మరిన్ని సలహాలు ఇచ్చి మళ్లీ మార్పులతో రమ్మని పంపిచేసారు.

తాజాగా మరోసారి మార్పుల అనంతరం చిరుకు బౌండెడ్ స్క్రిప్టు ని నందిని రెడ్డి నేరెట్ చేశారట. కానీ ఈసారి కూడా సేమ్ రిజల్ట్. స్క్రిప్టుతో మెగాస్టార్ ని మెప్పించడం లో తడబాటు కు గురయ్యారని ప్రచారమవుతోంది. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ పునరావృతం కావడంతో మెగా ఛాన్స్ ఇప్పటికి పెండింగు లో పడినట్టేనా? అన్న చర్చా సాగుతోంది.

రెండు మూడు సార్లు ప్రయత్నించినా ఇప్పుడు తిరిగి మొదటికే వచ్చింది. ఈ నేపథ్యంలో నందిని రెడ్డి మరోసారి స్క్రిప్టును సరి చేసి మెగాస్టార్ కి వినిపిస్తారా? లేక కొత్త స్క్రిప్టు ఏదైనా సిద్దం చేసి మెగా కాంపౌండ్ లో అడుగు పెడతారా? అన్నది చూడాలి. తాజా రిజెక్షన్స్ నేపథ్యంలో ఈసారి కచ్చితంగా రచయితల సహకారం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మరి నందిని రెడ్డి ఆ కీలకమైన స్టెప్ తీసుకుంటారా? సొంత ట్యాలెంట్ తోనే ఒప్పిస్తారా? అన్నది చూడాలి.
Please Read Disclaimer