ఎన్టీఆర్ కోసం మెగాస్టార్ స్టోరీ లైన్ తీసుకున్నారా…?

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తారక్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ డైరెక్షన్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ (చిన్నబాబు) – కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. నిజానికి ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి.. 2021 సమ్మర్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించారు. అయితే కరోనా వచ్చి అన్ని తారుమారు చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమా స్టోరీ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

కాగా ఈ సినిమా పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందట. ఇక ఎన్టీఆర్ బిజినెస్ మ్యాన్ నుంచి రాజకీయ నాయకుడుగా ఎలా మారాడు ఎందుకు మారాడనే నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. అంతేకాకుండా ఈ చిత్రం ఒకప్పటి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సూపర్ హిట్ సినిమా స్టోరీ లైన్ ను తీసుకొని ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి రూపొందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ గతంలో కూడా చాలా సినిమాలు ఇన్స్పిరేషన్ గా తీసుకొని తెరకెక్కిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ కోసం చిరు సినిమా స్టోరీ లైన్ తీసుకున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత తారక్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంభందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయి.
Please Read Disclaimer