పరిశ్రమ పెద్దగా మెగాస్టారే కరెక్ట్! -సి.కళ్యాణ్

0

దాసరి నారాయణరావు స్వర్గస్తులైన తర్వాత పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన ఉన్నంత కాలం పరిశ్రమలో ఏ సమస్య తలెత్తినా ముందుండి పరిష్కరించేవారు. 24 శాఖలను సమన్వయం చేయడంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండేది. మీడియా విషయంలోనూ ఏ సమస్య వచ్చేది కాదు. కానీ ఇప్పుడా ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. నాలుగేళ్లగా మా అసోసియేషన్ లో తలెత్తిన చిన్న చిన్న సమస్యలు ఎంతటి చర్చకు దారి తీసాయో తెలిసిందే. ఇలాంటి మరెన్నో సమస్యలతో నలిగిపోతున్న టాలీవుడ్ కి ఒక దారి చూపేవారు దాసరి. తాజాగా చిత్ర సీమలో చాలా సమస్యలున్నాయని నిర్మాత సి. కళ్యాణ్ పునరుద్ఘాటించారు.

మరి వీటన్నింటికి తక్షణ పరిష్కారం ఏంటి? వాటిని తీర్చే వ్యక్తి ఎవరు? అంటే మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే వాటికి న్యాయం చేయగలరని సి.కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని చిరంజీవికి తాను వివరించానని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ` కింద స్థాయి నుంచి వచ్చిన నటుడాయన కష్టం సమస్యల గురించి తెలిసిన వ్యక్తి. చిరంజీవి మాటంటే అందరికీ ఓ గౌరవం. దాసరి గారిలానే ఆయన కూడా చిన్న సినిమాలకు ఎంతగానో ప్రోత్సహిస్తారు.

ఆయన మాట్లాడే విధానం.. నడవడిక నచ్చనది ఎవరికి? ఆయన అంటే అందరికీ ఇష్టం.. గౌరవం. వీలైనంత త్వరాగా చిరంజీవి ఆ స్థానాన్ని భర్తీ చేస్తే బాగుంటుందని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. అలాగే 2020లో సి.కళ్యాణ్ దర్శకుడిగా మారబోతున్నట్లు తెలిపారు. దర్శకుడిని అవ్వాల్సిన వాడిని అనుకోకుండా నిర్మాతనయ్యానని.. 2020లో తన డ్రీమ్ నెరవేర్చుకోబోతున్నట్లు స్ఫష్టం చేసారు. అలాగే చిన్న సినిమాలే పరిశ్రమకు ముఖ్యం. పెద్ద సినిమాలు ఏడాదికి 30కి మంచి రావడం లేదని.. ఇలాగైతే ఆదాయంలో పరిశ్రమ వెనుక బడుతుందని తెలిపారు.
Please Read Disclaimer