మెగాస్టార్ కొత్త ఇంట్లో ఎయిటీస్ స్టార్స్ పార్టీ?

0

80ల నాటి తారలంతా `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ప్రతియేటా ఓచోట మీటవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిసారీ చెన్నయ్ లాంటి చోట ఈ మీటింగ్ ని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని.. ఆయనే హోస్టింగ్ చేయబోతున్నారని ఇప్పటికే ప్రచారమైంది.

రీయూనియన్ పార్టీ లో ఈసారి 1980-1990లో అగ్ర తారలు పాల్గొననున్నారని తెలుస్తోంది. గత తొమ్మిదేళ్లుగా ఈ వేడుకలు విజయవంతంగా జరుగుతున్నాయి. పదో సారి విజయవంతం చేయాలని మెగాస్టార్ ఎంతో పట్టుదలగా ఏర్పాట్లు చేస్తున్నారట. `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` తారలకు ఓ డ్రెస్ కోడ్ ఉంది. ఆ డ్రెస్ తో మాత్రమే ఈ పార్టీకి స్టార్స్ అంతా అటెండవుతున్నారు. దశాబ్ధం పూర్తవుతోంది కాబట్టి ఈసారి స్పెషల్ డ్రెస్ కోడ్ హైలైట్ గా ఉంటుందని తెలిసింది. ఇక స్టార్లు ధరించే డిజైన్ పైనే డికేడ్ సెలబ్రేషన్ అని వేస్తున్నారట.

వీటన్నిటినీ మించి ఈసారి పదో వార్షికోత్సవ పార్టీని హైదరాబాద్ లోని చిరంజీవి స్వగృహం లో నిర్వహిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ లో నిర్మించుకున్న కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి ఈ వారంలో రెడీ అవుతున్నారని వార్తలొస్తున్నాయి. బహుశా .. ఇదే కొత్త ఇంట్లో 80ల నాటి తారల రీయూనియన్ పార్టీని చేస్తారా? అంటూ అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. కొత్త గృహంలో అదిరిపోయే పార్టీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ వేడుకల్లో ఎవరెవరు ఉంటారు? అన్నదానికి తాజాగా సమాధానం వచ్చింది. ప్రతిసారీ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి- మోహన్లాల్- బాలకృష్ణ- వెంకటేశ్- మోహన్ బాబు వంటి స్టార్లు ఈ సందడి చేస్తున్నారు. సుహాసిని- ఖుష్బూ -రాధిక- సుమలత ఆర్గనైజర్స్ గా ఉన్నారు. వీకే నరేశ్- అర్జున్- జాకీ ష్రాఫ్- రమ్యకృష్ణ- ప్రభు- శోభన- భాగ్యరాజ్- శరత్కుమార్-సత్యరాజ్- జయరామ్- నదియా-సుమన్ వంటి తారలు ఈ పార్టీకి ఎటెండవుతున్ననారు. చిరు ఇంట పార్టీ కి వీళ్ల తో పాటే బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ సహా పలువురు స్టార్లు ఎటెండ్ కానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్ భాయ్ దబాంగ్ 3 చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు కాబట్టి సల్మాన్- ప్రభుదేవా బృందం ఈ పార్టీకి ఎటెండయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.