చీర కట్టులో వావ్ మేఘా

0

నితిన్ హీరోగా నటించిన ‘లై’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా వెంటనే నితిన్ ఆమెకు ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అధృష్టం కలిసి రాకపోవడంతో ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈ అమ్మడికి తమిళం నుండి ఆఫర్లు వచ్చాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ పేటా మూవీలో నటించింది. ఆ తర్వాత పలు తమిళ సినిమాలు మరియు ఒక హిందీ సినిమాలో కూడా నటించింది. ఇదే సమయంలో తెలుగులోనూ అవకాశాలు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ చేసే ఈ అమ్మడు తాజాగా చీర కట్టు స్టిల్స్ షేర్ చేసి మెప్పించింది.

లైట్ కలర్ సింపుల్ సారీలో మేఘా మెరిసింది. కనిపించి కనిపించని నడుము అందాలు చూపిస్తూ అందంగా ముస్తాబు అయ్యి నెటిజన్స్ ను కవ్వించింది. చీర కట్టులో ఉన్న ఏడు ఫొటోలు షేర్ చేసి డిఫరెంట్ యాంగిల్ మరియు డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. మోడ్రన్ డ్రస్ ల్లో మాత్రమే కాకుండా ఇలా చీర కట్టులో కూడా మేఘా చాలా బాగుందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వావ్ మేఘా ఇంత అందమైన నిన్ను టాలీవుడ్ హీరోలు ఎందుకు చూడటం లేదు అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి మేఘా ఆకాష్ చీర పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.