అన్నయ్య నాన్న కూచి.. తమ్ముడు మమ్మీ కూచి!

0

నటవారసులు వస్తున్నారు! అంటే పరిశ్రమలో ఆసక్తి నెలకొంటుంది. ఇండస్ట్రీ టాప్ యాక్టర్ గా మెప్పించిన రియల్ స్టార్ శ్రీహరి వారసులు ప్రస్తుతం పెద్దవాళ్లయ్యారు. ఇద్దరు కుమారుల్లో ఒకరు హీరో అవుతుంటే మరొకరు దర్శకుడిగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీహరి రెండో కుమారుడు మేఘాంశ్ శ్రీహరి కథనాయకుడిగా నటించిన రాజ్ దూత్ ఈ నెల 12న రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ఇంటర్వ్యూలో మేఘాంశ్ మూవీ గురించి అలాగే తన అన్న శశాంక్ .. మామ్ శాంతి గురించి పలు ఆసక్తికర సంగతుల్ని తెలిపారు.

ఇండస్ట్రీలో నటవారసులుగా ప్రవేశం చేస్తున్నారు. మీరు హీరో అయితే అన్నయ్య ఏమవుతారు? అని ప్రశ్నిస్తే.. తాను హీరోగా రాణించేందుకు ప్రయత్నిస్తుంటే.. అన్నయ్య శశాంక్ మాత్రం డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నారని తెలిపారు. పెద్దోడు శశాంక్ శ్రీహరి తండ్రి శ్రీహరి పోలిక.. కానీ దర్శకుడవ్వాలన్నది యాంబిషన్.. తమ్ముడు మేఘాంశ్ తల్లి శాంతి పోలిక.. అతడు హీరో అవుతున్నారు. అయితే అన్నదమ్ములిద్దరినీ హీరోలుగా చూడాలని శాంతి శ్రీహరి భావిస్తున్నారట. మొత్తానికి రియల్ స్టార్ ఫ్యామిలీ నుంచి వారసులు సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే రాజ్ దూత్ కి సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బృందం యు సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాతో రచయితల ద్వయం అర్జున్ – కార్తీక్ దర్శకులుగా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రాజ్ దూత్ కథాంశం గురించి మేఘాంశ్ ముచ్చటిస్తూ.. ఇది ట్రావెల్ బేస్ స్టోరి కాదు.. ఇన్ ఫీల్డ్ మీద రాజ్ దూత్ ని వెతుకే హీరో కథేంటో తెరపైనే చూడండి! అని తెలిపారు. అయితే రాజ్ దూత్ లో ఏవో విలువైనవి ఉంటాయి.. అవేంటి? అన్నదే సస్పెన్స్ అని తెలుస్తోంది. ఇక మేఘాంశ్ కి శాంతి శ్రీహరి డ్యాన్స్ ల్లో శిక్షణనిచ్చారు. తననుంచి రెగ్యులర్ గా టిప్స్ తీసుకుంటాడట. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. రాజ్ దూత్ ప్రారంభానికి ముందు ఒక నెలరోజుల పాటు నటనలో శిక్షణ తీసుకున్నానని మేఘాంశ్ తెలిపారు. అకడమిక్ స్టడీస్ టైమ్ లో స్టేజీ పై నటించడం కలిసొస్తోందని తెలిపారు. తండ్రి పేరు నిలబెడతాన్న యువహీరో తొలి ప్రయత్నం ఎలా ఉండబోతోంది? అన్నది వేచి చూడాల్సిందే.
Please Read Disclaimer