వైకుంఠపురం లో మెగాస్టార్ సీన్స్?

0

అల్లు అర్జున్ దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. గత ఏడాది ఆరంభంలో నా పేరు సూర్య చిత్రాన్ని తీసుకు వచ్చిన అల్లు అర్జున్ కి ఆ సినిమా నిరాశ మిగిల్చింది. నా పేరు సూర్య ఎఫెక్ట్ తో దాదాపు సంవత్సరం వరకు బన్నీ ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. చివరకు తనకు జులాయి మరియు సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలను ఇచ్చిన త్రివిక్రమ్ తో మళ్లీ చేసేందుకు సిద్దం అయ్యాడు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బన్నీకి హ్యాట్రిక్ ఇచ్చే ఉద్దేశ్యం తో ఒక మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నాడట. త్రివిక్రమ్ శైలి ఎంటర్ టైన్ మెంట్ తో ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని రౌడీ అల్లుడు ఆఫీస్ తరహా సీన్స్ ఉంటాయని.. ఆ సీన్స్ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయంటూ అనధికారికంగా చెబుతున్నారు. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ మరియు ఆయన స్టైల్ చూస్తుంటే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందనిపిస్తుంది.

రౌడీ అల్లుడు సీన్స్ ను ఈ సినిమాలో రిపీట్ చేస్తే సినిమా పై అంచనాలు ఆకాశానికి తాకడం కన్ఫర్మ్. ఇప్పటి వరకు పూర్తి స్టోరీ అయితే రివీల్ కాలేదు. కాని ఈ కథను ‘ఇంటిగుట్టు’ అనే పాత సినిమా ను ఇన్సిపిరేషన్ గా తీసుకుని రాసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై కూడా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా విడుదల కాబోతుంది. ఆ సినిమాకు సరిపోటీగా ఈ సినిమాను నిలిపేందుకు త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
Please Read Disclaimer