ఓ బ్లాక్ బస్టర్ ఓ డిజాస్టర్

0

సినిమా పరిశ్రమ లో హిట్లు ఫ్లాపులు కామనే. ఒక సారి అదిరిపోయే హిట్ లక్కీ హీరోయిన్ అనిపించుకుంటే మరో సారి ఫ్లాప్ అందుకొని అవకాశాల కు దూరమైన హీరోయిన్ అనిపించుకుంటారు. మెహ్రీన్ పరిస్థితి ఇలాగే ఉంది. ఈ ఏడాదిలో అమ్మడు నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

అందులో ఒకటి ‘F2’.ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే ఇటివలే వచ్చిన ‘చాణక్య’ డిజాస్టర్ గా నిలిచింది. F2 సక్సెస్ ఎంజాయ్ చేసే లోపే డిజాస్టర్ వచ్చి పలకరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు కళ్యాణ్ రామ్ తో ‘ఎంత మంచి వాడవురా’లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా మీదే పూర్తి ఆశలు పెట్టుకుంది. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ తో మళ్ళీ హిట్ కొట్టి తెలుగు లో వరుస అవకాశాలు అందుకోవాలని చూస్తోంది. మరి ఈ పంజాబీ బ్యూటీ కి ‘ఎంత మంచి వాడవురా’ మంచి హిట్ అందిస్తుందో లేదో ?
Please Read Disclaimer