Templates by BIGtheme NET
Home >> Cinema News >> అత్యంత ప్రమాదకరమైన స్త్రీ అందుకు నిరాకరిస్తుంది.. మెహ్రీన్ ఆసక్తికరమైన పోస్ట్..!

అత్యంత ప్రమాదకరమైన స్త్రీ అందుకు నిరాకరిస్తుంది.. మెహ్రీన్ ఆసక్తికరమైన పోస్ట్..!


‘ఎఫ్ 2’ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా ఇటీవల తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్ తో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్న మెహ్రీన్.. దాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేసింది. పెళ్లి క్యాన్సిల్ చేసుకువడం అనేది తన పర్సనల్ విషయమని.. అందరూ అర్థం చేసుకొని దీనిపై డిస్కషన్ చేయకుండా ఉంటారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చింది. భవ్య బిష్ణోయ్ సైతం ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరమే లేదన్నట్లు మాట్లాడారు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోడానికి స్పష్టమైన కారణం ఏంటో తెలియనప్పటికీ సోషల్ మీడియాలో దీనిపై అనేక వార్తలు వినిపించాయి.

ఇదిలా ఉంటే నిశ్చితార్థం రద్దు చేసుకున్న తర్వాత మెహ్రీన్ ఎప్పటిలాగే సినిమా షూటింగులతో బిజీగా అయ్యారు. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా మెహ్రీన్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఓ హాట్ ఫోటోని షేర్ చేసిన అమ్మడు.. ”అత్యంత ప్రమాదకరమైన స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి మీ కత్తి మీద ఆధారపడడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ఆమె సొంతంగా ఓ కత్తిని కలిగి ఉంటుంది” అని పోస్ట్ పెట్టింది. మెహ్రీన్ పెట్టిన క్యాప్సన్ కాస్త గందరగోళంగా ఉన్నా.. తనను తాను అత్యంత ప్రమాదకరమైన స్త్రీని అని చెప్పుకుంటుందని.. ఇతరులపై ఆధారపడనని చెప్పడానికే ఈ పోస్ట్ చేసారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మెహ్రీన్.. ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకుని వరుస అవకాశాలు అందుకుంది. ‘మహానుభావుడు’ ‘రాజా ది గ్రేట్’ ‘జవాన్’ ‘ఎఫ్ 2’ వంటి చిత్రాల్లో మెప్పించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ ప్రాంఛైజీలో వస్తున్న ”ఎఫ్ 3″ సినిమాలో నటిస్తోంది. ఇందులో వరుణ్ తేజ్ కు జోడీగా ఈ బ్యూటీ కనిపించనుంది.