హనీ ఈజ్ ది బెస్ట్.. నో డౌట్

0

మెహ్రీన్ పీర్జాదా నాని సినిమా ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో టాలీవుడ్ ఎంటర్ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో మంచి ఆఫర్లే వచ్చాయి. ‘మహానుభావుడు’.. ‘రాజా ది గ్రేట్’ సినిమాలతో మరి కొన్న హిట్లను కూడా తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ తర్వాత మాత్రం ఫ్లాపుల హీటు తగిలింది. పోయినేడాది ‘F2’.. నెల క్రితం రిలీజ్ రిలీజ్ అయిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఇక స్పీడ్ సరిపోలేదు అనుకుందేమో.. సోషల్ మీడియాలో కూడా జోరు పెంచింది.

తన ఇన్స్టా ఖాతా ద్వారా ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్లతో టచ్ లో ఉంటోంది. తాజాగా ఈ భామ కొత్త ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసింది. క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు కానీ ఫోటోతో నెటిజన్లను కట్టిపడేసింది. పారదర్శకంగా ఉండే సిమెంట్ కలర్ డ్రెస్సు ధరించి ఓ బొమ్మలా నిలుచుంది. మెహ్రీన్ హెయిర్ స్టైల్.. ఆ డిజైనర్ డ్రెస్సు.. నిలుచున్న విధానం చూస్తుంటే ఒక ఎల్లోరా శిల్పమో.. అజంతా అందమో అనిపించేలా ఉంది.

ఈ ఫోటోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “ప్రెట్టి బేబీ”.. “క్యూట్ డ్రెస్”.. “మెహ్రీన్ బెహత్రీన్” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక మెహ్రీన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే నాగ శౌర్య కొత్త సినిమా ‘అశ్వథ్థామ’ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Read Disclaimer