మంచివాడు కూడా ఈమెను మోసం చేశాడు

0

నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహ్రీన్ ఆ తర్వాత తెలుగు మరియు తమిళంలో పలు చిత్రాల్లో నటించింది నటిస్తూనే ఉంది. కాని ఈ అమ్మడికి మాత్రం లక్ కలిసి రావడం లేదు. ముఖ్యంగా తెలుగులో ఈ అమ్మడికి టైం ఏమాత్రం కలిసి రావడం లేదు. చేసిన ప్రతి సినిమా కూడా నిరాశ పర్చుతూనే ఉంది. ఒకవేళ సినిమా సక్సెస్ అయినా ఆమెకు ఆ క్రెడిట్ దక్కడం లేదు.

గత ఏడాది ఎఫ్ 2 చిత్రంతో సక్సెస్ ను దక్కించుకున్న మెహ్రీన్ కు ఆ సక్సెస్ పెద్దగా ఉపయోగపడింది లేదు. గత ఏడాది ఎఫ్ 2 చిత్రంతో పాటు చాణక్య చిత్రంలో కూడా నటించింది. గోపీచంద్ నటించిన ఆ చిత్రం కూడా నిరాశ పర్చింది. తాజాగా ఈమె కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రూపొంది విడుదలైన ఎంత మంచి వాడవురా చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది.

మెహ్రీన్ మొదటి సినిమా సమయంలో జూనియర్ మిల్కీ బ్యూటీ అంటూ ప్రశంసలు దక్కించుకుంది. స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంటుందని భావించారు. కాని అంచనాలు తారుమారు అయ్యాయి. తెలుగులో ఈమెకు లక్ కలిసి రావడం లేదు. తమిళంలో ఇటీవల ధనుష్ తో పటాస్ చిత్రంలో నటించింది. ఆ సినిమా కూడా ఈమెకు గొప్ప పేరు ఏమీ తెచ్చి పెట్టలేదు. తెలుగు.. తమిళం అప్పుడప్పుడు పంజాబీ చిత్రాలు చేస్తున్నా కూడా ఈ అమ్మడికి మాత్రం సక్సెస్ అందని ద్రాక్ష మాదిరిగానే ఉంది.
Please Read Disclaimer