మీమ్స్ : సరిలేరు నీకెవ్వరు రష్మిక ఎక్కడ?

0

‘ఛలో’ చిత్రంతో సక్సెస్ ను దక్కించుకున్న రష్మిక ‘గీత గోవిందం’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయ్యింది. ఆ తర్వాత ఈ అమ్మడి టైం పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ అమ్మడు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంపై రష్మిక మందన్న చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో తన స్టార్ స్టేటస్ ను మరింత పదిలం చేసుకునేందుకు ఈమె తాపత్రయ పడుతుంది.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక లుక్ ఎలా ఉండబోతుందనే విషయమై ఇప్పటికే కొన్ని స్టిల్స్ ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు. ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రం టీజర్ మరియు రెండు పాటలు వచ్చాయి. ఆ రెండింటిలో కూడా రష్మిక జాడ కనిపించలేదు. దాంతో కొందరు రష్మిక అభిమానులు సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో అసలు రష్మిక ఉందా లేదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ విచ్చల విడిగా ట్రెండ్ అవుతున్నాయి. డియర్ కామ్రేడ్ సినిమాలోని డైలాగ్ ను పేరడీ చేసి బాబీ ఈ పాటలో కూడా నేను లేను అంటూ రష్మిక కన్నీరు పెట్టుకుంటున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల ఒక స్టిల్ విడుదల చేయడంతో ఇప్పటికి మా లిల్లీని చూపించారు సంతోషం అంటూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.

మీమ్స్ ఎన్ని వస్తున్నా సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక మందన్న పాత్ర తప్పకుండా ఆకట్టుకుంటుందని.. ఈ చిత్రం ఆమెకు మరింత పేరును తీసుకు వస్తుందని ఆమె అభిమానులు కొందరు చాలా నమ్మకంగా ఉన్నారు. సంక్రాంతికి ఈ చిత్రం రాబోతున్న విషయం తెల్సిందే. మహేష్ బాబుతో పాటు అల్లు అర్జున్ సినిమాలో కూడా రష్మిక మందన్న హీరోయిన్ గా ఎంపిక అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. ఆ విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
Please Read Disclaimer