సైలెంట్ అయిపోయిన మేర్లపాక గాంధి!

0

ఇండస్ట్రీ అంతా హిట్ చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా డైరెక్టర్లకు హిట్.. ఫ్లాప్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. హిట్ వస్తే చాలామంది నిర్మాతలు.. హీరోలు సినిమా చేసేందుకు ముందుకు వస్తారు. అదే ఫ్లాప్ వస్తే మొహం చాటేస్తారు. ప్రస్తుతం యువ దర్శకుడు మేర్లపాక గాంధి పరిస్థితి అలాగే ఉందని టాక్ వినిపిస్తోంది.

మొదటి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తోనే మేర్లపాక గాంధి విజయం సాధించి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమాతో హీరో సందీప్ కిషన్ కెరీర్ కూడా ఊపందుకుంది. ఆ సినిమా తర్వాత మూడేళ్లకు శర్వానంద్ తో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్రాన్ని రూపొందించాడు మేర్లపాక గాంధి. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత నాని తో అవకాశం వచ్చింది. డబల్ హ్యాట్రిక్ పూర్తి చేసిన వరస విజయాలతో దూసుకుపోతున్న నానితో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. దీంతో ఒక్కసారిగా మేర్లపాక డిమాండ్ తగ్గిపోయింది.

ఈ సినిమా హిట్ అయి ఉంటే మేర్లపాక గాంధికి మరో ఆఫర్ వచ్చి ఉండేది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి రివర్స్ లో ఉంది. మేర్లపాక గాంధి కూడా సినిమాకు సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకుంటాడు. మరి ఈ టాలెంటెడ్ డైరెక్టర్ త్వరలోనే మరో మంచి కథతో సినిమా రూపొందించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తాడని ఆశిద్దాం.
Please Read Disclaimer