సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

లేడీ ఆర్టిస్టు బాబోయ్ ..గప్ చుప్!!

0

మీటూ కొట్టిన దెబ్బ ఇది. దెబ్బకు జంక్షన్ జామ్ అయిపోయింది!! ఇప్పుడు ఎవరైనా లేడీ ఆర్టిస్టుతో మాట్లాడాలంటేనే ఒణుకు. ఒళ్లంతా షివరింగ్ వచ్చేస్తోందిట. ప్రస్తుతం దీనిపై సినిమా వర్గాల్లో – సినీ పెద్దల్లో – 24 శాఖల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. టాలీవుడ్ 85ఏళ్ల హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా ఈ ఉత్పాతం ఊపేస్తోందని చెబుతున్నారు. వాస్తవానికి మీటూ ముందు సన్నివేశం వేరు. మీటూ తర్వాత సన్నివేశం వేరు. మాన్ స్టర్స్.. రాక్షసులు.. రక్కసులు.. పేరు ఏదైనా మనిషి రూపంలో తిరిగే మృగాళ్లు మాత్రం కాస్త ఒద్దికగా బుద్ధిగా ఉంటున్నారట. ద్యావుడ! ఇది ఊహించనిది.. వీళ్లు కూడా మారారు.. అసలు లేడీ ఆర్టిస్టుతో మాట్లాడేప్పుడు ఒద్దికగా.. పద్ధతిగా.. అయ్యో పాపం! నోట్లో వేలు పెడితే కొరకలేం ప్లీజ్! అన్నట్టుగానే బిహేవ్ చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నది నేరుగా అనుభవంతో చెబుతున్న మాట!

బాలీవుడ్ లో కొంప కొల్లేరైంది. ఆ దెబ్బకు టాలీవుడ్ బిగ్ బిల్లో సైతం మీటూ దెబ్బకు ఝడుసుకుంటున్న వైనం ప్రస్తుతం సర్వాత్రా చర్చకొచ్చింది. అయితే ఉత్పాతంలో పెను ఉత్పాతంలా.. అసలు లేడీ ఆర్టిస్టు అంటేనే దూరం దూరంగా భయం భయంగా ఉంటున్నారట.. పలువురిని కదిలిస్తే.. ఆన్ సెట్స్ అనుభవాల గురించి కోకొల్లలుగా చెబుతున్నారు ! ప్రొడక్షన్ మేనేజర్ లు – మేల్ ఆర్టిస్టులు ఎంతో ఎలర్ట్ అయిపోయారట. ఇంతకుముందులా లేడీ ఆర్టిస్టుతో సన్నిహితంగా మెలగాలంటేనే విపరీతంగా భయపడిపోతున్నారట. అంతేకాదు.. లొకేషన్ లో సీన్ గురించి ఏదైనా విషయం వాళ్లతో ముచ్చటించాలంటే ఇదివరకూ ఉన్నంత చనువు లేదట. ఒకటే బిగుసుకుపోతున్నారట.

అసలు ఈ మీటూ ఇంపాక్ట్ ఎలా ఉంది? అని ప్రశ్నిస్తే.. మామూలుగా లేదు బాబోయ్ అనేస్తున్నారు కొందరు ప్రొడక్షన్ మేనేజర్ లు అయితే. ఇటీవలే ఓ వేదికపై నటుడు కం ఎంపీ మురళిమోహన్ అంతటివాడే మీటూ ప్రస్థావన తెచ్చి బాబోయ్ అనేశారు. అసలు లేడీ ఆర్టిస్టులతో మాట్లాడాలంటేనే భయపడిపోతున్నారు. కనీసం లొకేషన్ లో ఏదైనా షాట్ గురించి మాట్లాడాలన్నా భయపడే సన్నివేశం ఉంది. ఇది మరీ అంత మంచిది కాదేమో! అని ఆయన శైలిలో పెదవి విరిచేసారు. ఒకప్పటిలా లేదిప్పుడు.. బెరుకుగానే లేడీ ఆర్టిస్టులతో మూవ్ అవ్వాల్సిన దారుణ సన్నివేశం ఉందన్నది ఆయన మాటలోని మీనింగ్. తిక్క కుదిరింది పో అనుకోవాలా? లేక మంచే జరుగుతోందా? అన్నది అర్థంకాని పరిస్థితి ఉందిప్పుడు. అంతేకాదు.. దీని వల్ల కొత్తగా ర్యాపో సమస్యలు పుట్టుకొచ్చాయి. దర్శకుడు-ఆర్టిస్టు అవినాభావ సంబంధంపైనా `మీటూ` పెద్ద ప్రభావమే చూపిస్తోందని అర్థమవుతోంది. “ఒకప్పుడు సెట్స్లో అంతా కుటుంబంలా కలిసిపోయేవారు.. చాలాకాలంగా అదీ పోయింది..“ ఇప్పుడు మీటూ దెబ్బకు ఆర్టిఫిషియల్ లక్క బొమ్మల్లా పని చేయాల్సిన దుస్థితి నెలకొందని ఓ ప్రొడక్షన్ మేనేజర్ వాపోవడం చూస్తుంటే సన్నివేశం కాస్త ఇబ్బందికరంగానే ఉందని తెలుస్తోంది. ఇది మంచికా చెడుకా? అన్నది అటుంచితే.. `మీటూ-టాలీవుడ్` పేరుతో సమంత – యాంకర్ ఝాన్సీ – నందిని రెడ్డి వంటి వారి అలయెన్స్ బాగానే ఝడిపించారని వేరొక కోణంలో అర్థమవుతోంది. ప్చ్.. ఇంతలోనే ఎంత మార్పో!!
Please Read Disclaimer