లేడీగాగాకే మతి చెడేలా మిల్కీ ఇస్టయిల్!

0

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ఇస్పీడ్ గురించి తెలిసిందే. 2020 ఈ అమ్మడి కెరీర్ కి ఒక రకంగా బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. సైరా- నరసింహారెడ్డి చిత్రంతో తమన్నా కి ఇంపార్టెంట్ రోల్ ఇవ్వడం కాన్ఫిడెన్స్ లెవల్ పెంచింది. క్వీన్ రీమేక్ దటీజ్ మహాలక్ష్మి రిలీజ్ కి రాకపోయినా.. ఇతర కమిట్ మెంట్లతో బిజీ అయ్యింది. ఇక నిరంతరం మిల్కీ అభిమానులకు టచ్ లో ఉంటూ ఇన్ స్ట్రాగామ్ లో అదిరిపోయే ఫొటోలను షేర్ చేస్తోంది.

తాజాగా వెడ్డింగ్ వావ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై మిల్కీ సంథింగ్ స్పెషల్ లుక్ తో కనిపించింది. ఇక ఈ లేటెస్ట్ లుక్ లో లేడీ గాగానే గుర్తు చేసింది తమన్నా. ప్రేమ .. ఫన్.. డయాన్సింగ్ .. అనుభవాల్ని షేర్ చేసేందు కే ఈ ప్రయత్నం. మంచి ఫుడ్ ని ఆస్వాధించేందుకు వెడ్డింగ్ కి వెళ్లాలి! అంటూ ఫన్నీగా ఒక నోట్ ని ఇచ్చింది తమన్నా. 9 వ వార్షికోత్సవం.. ఆ తర్వాత 15వ వార్షికోత్సవాని కి వెడ్డింగ్ వావ్స్ ప్రత్యేక కవర్ పేజీని తానే అలంకరించాన ని తమన్నా కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేసింది.

అంతా బాగానే ఉంది కానీ.. కాస్త పాశ్చాత్య ధోరణి మేకప్ ఎక్కువైనట్టుంది. ఆ కళ్లకు కాటుక అవసరాన్ని మించి ఉంది. మరీ లేడీ గాగా వేషంలా ఉంది! అంటూ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇక మిల్కీ ఇంతకుముందు బాత్ టబ్ లో టవల్ తో ఇచ్చిన ఫోజు జోరుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. కెరీర్ సంగతి చూస్తే.. మిల్కీ బ్యూటీ తాజాగా నవాజుద్దీన్ సిద్దికీ సరసన `బోలే చుడియన్` లో నటించింది. కొంత గ్యాప్ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి షమాస్ నవాబ్ సిద్దిక్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం గోపిచంద్ కథానాయకుడిగా సంపత్ నంది తీస్తున్న చిత్రం లో తమన్నా నటిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-