మైండ్ బ్లాక్: మాస్ హంగామానే కానీ అద్భుతం కాదు!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. కొద్దిరోజుల క్రితం టీజర్ విడుదల చేస్తే భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా నుండి పాటలను మాస్ ఎంబీ మండేస్ పేరుతో ప్రతి సోమవారం రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా మొదటి లిరికల్ సాంగ్ ‘మైండ్ బ్లాక్’ ను కాసేపటి క్రితం విడుదల చేశారు.

ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ పాటకు సాహిత్యం అందించిన వారు శ్రీమణి & దేవీశ్రీ ప్రసాద్. ఈ పాటను ఆలపించిన వారు బ్లాజ్..రనినా రెడ్డి. పాటలో కొన్ని చోట్ల డైలాగ్స్ రూపంలో మహేష్ బాబు కూడా తన గాత్రం అందించడం విశేషం. బాబూ నువ్వు సెప్పు.. ఆడ్ని కొట్టమని డప్పు” అని అడగగానే మహేష్ బాబు “నువ్వు కొట్టరా” అనడం ఆసక్తికరంగా ఉంది. “మూన్ వాకు మూన్ వాకు పిల్లా నీ నడక చూస్తే మూన్ వాకు.. అర్త్ క్వేకు అర్త్ క్వేకు పిల్లా నువ్వు తాకుతుంటే అర్త్ క్వేకు నీ లిప్పులోనే ఉంది కప్పు కేకు” అంటూ ఎక్కువగా ఫన్నీ ఇంగ్లీష్ పదాలతో సాగిన తెలుగు పాట ఇది. మైండ్ బ్లాకు మైండ్ బ్లాకు అనేది హుక్ లైన్. ఈ పాటకు దేవీ ఒక మాస్ ట్యూన్ అందించగా బ్లాజ్.. రనినా రెడ్డి మంచి జోష్ లో పాడారు.

పాట ఎలా ఉంది అంటే అదిరిపోయేలా ఉంది అని చెప్పలేం కాని.. బాగుంది. వినగా వినగా శ్రోతలను ఆకట్టుకునే అవకాశం ఉంది.. ఇలాంటి మాస్ పాటలకు మంచి చిత్రీకరణ.. మాసు స్టెప్పులు తోడైతే మాత్రం సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది. దేవీ ఎలాంటి సంగీతం అందిస్తాడో అని ఎదురుచూసిన ప్రేక్షకులను థ్రిల్ చేయలేకపోయాడు కానీ.. నిరాశపరచలేదు. ఆలస్యం ఎందుకు వినేయండి.. మైండ్ బ్లాకు.
Please Read Disclaimer