ఆ 12 నిముషాలు ఊపిరి ఆగుతుందా ?

0

ఏమో అవుననే అంటున్నాయి యూనిట్ వర్గాలు. కేవలం 10 రోజుల వ్యవధిలో రాబోతున్న సాహో కోసం జరుగుతున్న హంగామా ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే వీడియో సాంగ్స్ రచ్చ చేయగా ట్రైలర్ వంద మిలియన్ల వ్యూస్ వైపు పరుగులు పెట్టి మరోసారి బాలీవుడ్ మేకర్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేసింది. నిజానికి ఇప్పటిదాకా సాహోకు సంబంధించి మనం చూసిందంతా జస్ట్ శాంపిల్ మాత్రమేనట.

అసలైన మజా వెండితెరపై ఉంటుందని కావాలనే అందులో ఏ ఒక్కటి రివీల్ చేయకుండా యువి టీమ్ జాగ్రత్త పడిందని న్యూస్ ఉంది. ఇదిలా మరో కీలకమైన లీక్ అప్ డేట్ ప్రకారం సాహో ప్రీ క్లైమాక్స్ లో 12 నిమిషాల పాటు సాగే మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్ ఒకటి మతులు పోయే రేంజ్ లో వచ్చిందట. దీనికే సుమారు 80 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టు తెలిసింది. ట్రైలర్ లో చూసిన శాండ్ ఫైట్ ఇందులో భాగంగానే వస్తుందని తెలిసింది. ఆద్యంతం నమ్మశక్యం కానీ రీతిలో దీన్ని ఎలా షూట్ చేసుంటారా అనే తరహాలో ఓ రేంజ్ లో వచ్చిందట.

ప్రీ క్లైమాక్సే ఈ లెవెల్ లో ఉంటే ఇక చివరి ఘట్టం గురించి చెప్పేదేముంది. అది మాత్రం సస్పెన్స్ అంటున్నారు మెంబర్స్. ఇలాంటి సర్ప్రైజులు సినిమా మొత్తం చాలానే ఉంటాయట. టికెట్ ధర ఎంత పెట్టినా దానికి పూర్తి న్యాయం జరిగేలా సాహో కంటెంట్ ఉంటుందని భరోసా ఇస్తున్నారు. అసలే వందల కోట్ల పెట్టుబడులు దీని మీద వరదలా పారుతున్నాయి. అంచనాలకు మించి ఉంటేనే అవన్నీ సేఫ్ అయ్యి లాభాలు వస్తాయి. ఏ మాత్రం అప్ అండ్ డౌన్ అయినా దెబ్బ మాములుగా ఉండదు. కానీ ఇప్పటిదాకా వచ్చిన లీక్స్ చూస్తుంటే ఆ భయమే అక్కర్లేదు అనిపిస్తోంది. ఎంత ఇంకో పది రోజులు యాంగ్జైటీని కంట్రోల్ చేసుకుంటే చాలు ఫలితం తెలిసిపోతుంది.
Please Read Disclaimer