లక్కీ ట్యాగ్ తగిలించినందుకు రష్మిక సీరియస్

0

ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక వరుసగా చిత్రాలు చేస్తున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఈమె నటించబోతుంది. నేడు విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ హిట్ అయితే ఈమె స్థాయి మరింత పెరగడం ఖాయం. అతి తక్కువ సమయంలోనే ఈమె స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అందుకే ఈమెను అంతా లక్కీ హీరోయిన్ అని.. లక్ కలిసి వచ్చి ఈమె స్టార్ హీరోయిన్ గా మారిపోయిందని అంటున్నారు. లక్కీ హీరోయిన్ రష్మిక అంటూ మీడియాలో ఈమెను సంభోదిస్తున్న నేపథ్యంలో అది తనకు నచ్చడం లేదని అంటోంది.

తాజాగా ఒక ఇంటర్వ్యలో రష్మిక మాట్లాడుతూ తనకేం ఊరికే ఈ సక్సెస్ లు ఈ పేరు రాలేదని వీటి వెనుక తాను పడ్డ కష్టం ఉందని చెప్పుకొచ్చింది. అంతా కూడా తాను లక్కీగా ఈ స్థాయికి చేరుకున్నట్లుగా అనుకుంటున్నారు. వారికి నేను పడుతున్న కష్టం కనిపించడం లేదా అంటూ ప్రశ్నించింది. ఒక సినిమా చేస్తున్నాను అంటే అందుకోసం ఎంతగా కష్టపడతానో నాకు మాత్రమే తెలుసు. డియర్ కామ్రేడ్ లో నటించే ముందు నాలుగు నెలల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేశాను. ఆ సమయంలో నేను పడ్డ కష్టం నాకు మాత్రమే తెలుసు అంది.

ఇక మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. మొదటి షెడ్యూల్ కశ్మీర్ లో చేశారు. అందులో నా పాత్ర లేదు. రెండవ షెడ్యూల్ లో నటించేందుకు సిద్దంగా ఉన్నాను. మహేష్ బాబుతో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో మొదటి షాట్ కు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నట్లుగా రష్మిక చెప్పుకొచ్చింది.
Please Read Disclaimer