ఏ బికిని హై దీవాని

0

బాలీవుడ్ బ్యూటీ మినిషా లాంబా పేరు మన తెలుగువారిలో తక్కువమందికే తెలిసి ఉంటుంది. దాదాపుగా ఇరవై హిందీ సినిమాల్లో నటించిన ఈ భామ ‘కార్పోరేట్’.. ‘రాకీ: ది రెబెల్’.. ‘అంటోనీ కౌన్ హై’.. ‘హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ .. ‘భేజా ఫ్రై’ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. సినిమాలే కాదు..హిందీ బిగ్ బాస్ 8 వ సీజన్ లో కూడా పాల్గొంది. ఇతర టీవీ రియాలిటీ షోలలో కూడా పాల్గొంటుంది. వయసు 34 అయినా సోషల్ మీడియాలో మంటలు పెట్టడంలో మహా నేర్పరి.

తాజాగా మినిషా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు “నేనిప్పుడు ఏం చెప్పాను” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒక ఫోటో వెయ్యి పదాలకు సమానం అని ఆంగ్లభాషలో ఒక కొటేషన్ ఉంది. మరి బికినీ ఫోటో పోస్ట్ చేసి ‘నేనేం చెప్పాను?’ అని అడిగితే మనం కూడా గడుసుగా “వెయ్యి పదాలు చెప్పావు లాంబా… ఇదో జంబో మెసేజ్” అని జవాబిస్తే సరి. ఇలాంటి చమత్కారాలు ఎప్పుడూ ఉండే సోదే కదా .. అందుకే ఫోటో గురించే మాట్లాడుకుంటే… బ్లాక్ కలర్ బికినీలో ఒక స్టార్ హోటల్ లోని ఈత కొలనుకు దగ్గరగా నిలుచుంది. చలువ కళ్ళజోడు.. ఒక చేతికి రిస్ట్ బ్యాండ్ ధరించి స్పైసీనెస్ కు స్టైల్ ను కూడా రంగరించింది. బికినీ ధరించడంతో యాబ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈలెక్కన ఈ మినిషా ఎంత భయంకరంగా ఎక్సర్ సైజులు చేస్తుందో మనం ఊహించుకోవచ్చు.

ఈ ఫోటోకు చాలామంది నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “లాజవాబ్ బికినీ”.. “ఏ బికినీ హై దీవాని”.. “ఆషిక్ బనాయా ఆప్ కి బికినీ నే”అంటూ రెచ్చిపోయారు. మినిషా సినిమాల విషయానికి వస్తే సంజయ్ దత్ సినిమా ‘భూమి'(2017) లో చివరిగా నటించింది. ఆ సినిమా తర్వాత మరో సినిమా ఆఫర్ రాలేదు.
Please Read Disclaimer