కమర్షియల్ కాకున్నా రూ.150 కోట్ల వసూళ్లు

0

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం టాప్ పొజీషన్ లో ఉన్నాడు. సినిమాల కలెక్షన్స్ పరంగా.. ఫోర్బ్స్ మిలియనర్స్ జాబితా పరంగా చూసినా కూడా బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ స్టార్ అక్షయ్ కుమార్. ఈమద్య కాలంలో ఈయన చేసిన ప్రతి సినిమా కూడా వంద కోట్ల మార్క్ ను చాలా ఈజీగా దాటేసింది. వంద కోట్లు అనేది అక్షయ్ కుమార్ కు కామన్ అయ్యింది. ఇక తాజాగా వచ్చిన ‘మిషన్ మంగల్’ చిత్రం కూడా ఈజీగా వంద కోట్లకు రీచ్ అయ్యింది.

ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిషన్ మంగల్’ చిత్రం 11 రోజుల్లో 164.61 కోట్ల రూపాయలను వసూళ్లు చేసినట్లుగా ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకటించాడు. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ లేకున్నా.. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా కూడా సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం రికార్డ్ అంటూ ఆయన పేర్కొన్నాడు. తక్కువ సమయంలో 150 కోట్లను అక్షయ్ ఇది రెండవ సారి క్రాస్ చేయడం అంటూ తరణ్ పేర్కొన్నాడు.

గతంలో రజినీకాంత్ తో కలిసి నటించిన ‘2.ఓ’ చిత్రం పది రోజుల్లో 150 కోట్లను రాబట్టింది. ఇప్పుడు మిషన్ మంగల్ తో మరోసారి పది రోజుల్లోనే 150 కోట్లకు మించి రాబట్టాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ తో పాటు విద్యాబాలన్.. తాప్సి.. సోనాక్షి సిన్హా.. నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటించారు. స్పేస్ సెంటర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంలో సఫలం అయ్యింది. ఇదో ఫక్త్ కమర్షియల్ సినిమా కాకున్నా కూడా మంచి వసూళ్లను రాబట్టడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. లాంగ్ రన్ లో ఈ చిత్రం 200 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home