మిషన్ మంగళ్ :టీజర్ టాక్

0

సాహోకి పోటీనే లేదనుకుంటున్నాం కానీ బాలీవుడ్ లో మాత్రం అక్షయ్ కుమార్ సవాల్ కు సై అంటున్నాడు. అతను లీడ్ రోల్ లో టాలెంటెడ్ మల్టీ హీరోయిన్ స్టారర్ గా రూపొందిన మిషన్ మంగళ్ వచ్చే నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా దీని టీజర్ ని లాంచ్ చేశారు. ఇండియన్ స్పేస్ హిస్టరీలో ఓ గొప్ప ఘనతగా చరిత్రలో నిలిచిపోయిన మంగళ్యాన్ మిషన్ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

ఇది సాధ్యమేనా అని అందరూ అనుమానంగా చూసిన మిషన్ ని తక్కువ ఖర్చుతో అధిక శాతం మహిళలున్న టీమ్ సహకారంతో స్పేస్ సెంటర్ చేసిన ఈ ప్రయోగం చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. దీని వెనుక ఎంతో కఠోర శ్రమ ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఉద్యోగుల త్యాగాలు ఉన్నాయి. వాటిని తెరమీద చూపించే ప్రయత్నమే మిషన్ మంగళ్. రాకేష్ పాత్రలో అక్షయ్ కుమార్ మరోసారి తన వైవిధ్యాన్ని చూపించబోతున్నాడు

జగన్ శక్తి దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ మూవీలో విద్యా బాలన్ – తాప్సీ – సోనాక్షి సిన్హా – నిత్య మీనన్ – కృతి కొల్హారి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీళ్ళను వెనుక నుండి నడిపించి లోకానికి మహిళా శక్తిని చాటే రాకేష్ ధావన్ పాత్రలో అక్షయ్ రియలిస్టిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. గ్లామర్ ప్రసక్తే లేకుండా సీరియస్ గా స్ఫూర్తి వంతంగా సాగె ఈ విజయ గాధకు తగ్గ ఛాయాగ్రహణం ఆర్ట్ డైరెక్షన్ అద్భుతంగా కుదిరాయి. కమర్షియల్ అంశాలు లేకపోయినా మంచి డెప్త్ ఉన్న సబ్జెక్టు కావడంతో మిషన్ మంగళ్ ఆసక్తి రేపుతోంది. స్వతంత్ర దినోత్సవం నాడు రానున్న మిషన్ మంగళ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి
Please Read Disclaimer