మిస్టర్ పర్ ఫెక్ట్ సాంగ్ ని లేపేశారు

0

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమీర్ ఖాన్-కరిష్మా కపూర్ నటించిన చిత్రం `రాజా హిందుస్థానీ`. 1996లో వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నదీమ్- శ్రావణ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీనే. పర్ దేశీ పర్ దేశీ జానా నహీ…తేరే ఇష్క్ మె నాచేంగే… కిత్ నా ప్యారా తుజే రబ్ నే బనాయా జీకరె దేక్ తారహూ… ఈ పాటలన్నీ ఇప్పటికీ హమ్మింగానే వున్నాయి. అయితే ఇందులోని `కిత్ నా ప్యారా తుజే రబ్నే బనాయా..` అంటూ సాగే పాటని `మర్ జావా` చిత్రం కోసం రీమిక్స్ చేసి రిలీజ్ చేశారు.

నుస్రత్ ఫతే అలీ ఖాన్ క్లాసిక్ సాంగ్గా పేరున్న ఈ పాటని మరోసారి తెర పైకి తీసుకొచ్చారు. సిద్ధార్థ్ మల్హోత్రా రకుల్ ప్రీత్ సింగ్- తారా సుతారియా కీలక పాత్రల్లో నటించారు. సిద్ధార్థ్ తో డీప్ లవ్ లో ఉన్న రకుల్ బాధల్ని ఈ పాటలో ఆవిష్కరించారు. సిద్ధార్ధ్ ప్రేమలో రకుల్ మదన పడుతుంటే అతడు మాత్రం అదేమీ పట్టనట్టుగా తారా సుతారియా చుట్టు తిరుగుతుంటాడు. ప్రేమలో ఈ సవతి పోరుని భరించలేని రకుల్ మదన పడుతుంటుంది.

ఇక్కడో విషయం చెప్పాలి. నవతరం అందాల భామ తారా సుతారియా అందం ముందు రకుల్ తేలిపోయినట్టే కనిపిస్తోంది. సిద్ధార్ధ్ మల్హోత్రా- తారా సుతారియాల కెమిస్ట్రీ బాగా కుదరడం.. ఆ ఇద్దరి జోడీ క్యూట్ గా కనిపించడం ఈ రొమాంటిక్ సాంగ్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రితేష్ దేశ్ముఖ్ ఇందులో మరుగుజ్జుగా నటించాడు. ఈ భారీ మాస్ యాక్షన్ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కాబోతోంది.
Please Read Disclaimer